Baby Boy Died : మూఢ నమ్మకంతో నాటువైద్యం- చిన్నపేగు తెగి చిన్నారి మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ మూఢ నమ్మకం చిన్నారి ప్రాణాన్ని చిదిమేసింది. రెండు నెలల చిన్నారికి నూరేళ్లు నిండేలా చేసింది.

Baby Boy Died : మూఢ నమ్మకంతో నాటువైద్యం- చిన్నపేగు తెగి చిన్నారి మృతి

Baby Boy Died

Baby Boy Died : రహదారులు, ఆస్పత్రులు, స్కూళ్లు వంటి మౌలిక సదుపాయాలు ఎన్ని అభివృధ్ధి చెందినా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇంకా కొందరు మూఢ నమ్మకాలనే నమ్ముతున్నారు. కంప్యూటర్ కాలంలోనూ ఊహాతీత శక్తులు, మూఢనమ్మకాలతో కొందరు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ మూఢ నమ్మకం చిన్నారి ప్రాణాన్ని చిదిమేసింది. రెండు నెలల చిన్నారికి నూరేళ్లు నిండేలా చేసింది.

జిల్లాలోని కరకగూడెం మండలం అశ్వాపురం  పాడువలస ఆదివాసీ గ్రామానికి చెందిన పొడియం దేవయ్య, సంగీత దంపతులకు రెండు నెలల క్రితం ఓబాబు పుట్టాడు. సోమవారం రాత్రి ఆ చిన్నారి కడుపునొప్పి వచ్చి బాధతో ఏడవ సాగాడు.  కడుపు నొప్పి తగ్గేందుకు వారు మూఢ నమ్మకాల వైపు మొగ్గు చూపారు. బాబును తీసుకుని గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని సంప్రదించారు.
Read Also : JusticeForGirl : రాజుగాడెక్కడ..? 2,700 సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు
అతడు బాబు బొడ్డు చుట్టూ పంటితో కొరికాడు. నొప్పితో చిన్నారి మరింత ఏడ్వసాగాడు. ఆవ్యక్తి  చిన్నారికి పసరు మందు పోశాడు. మంగళవారం ఉదయం గ్రామానికి వెళ్లిన ఆశా కార్యకర్త  చిన్నారిని వెంటనే గుర్తించి కరకగూడెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించింది.

పరిస్ధితి విషమించటంతో వైద్య సిబ్బంది 108 వాహనం ద్వారా భద్రాచలం ఆస్పత్రికి పంపించారు. అక్కడ వైద్యులు పరిశీలించగా శిశువు కడుపులో చిన్న పేగు తెగినట్లు గుర్తించారు. వెంటనే చికిత్స ప్రారంభించారు. కానీ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం చిన్నారి కన్ను మూశాడు.