Telangana Rains : తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

గురువారం నుంచి శుక్రవారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

Telangana Rains : తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

Telangana Rains (3)

Hyderabad Meteorological Center : తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు పడనున్నాయి. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

గురువారం నుంచి శుక్రవారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
శుక్రవారం నుంచి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు బుధవారం హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

Telangana Rains : నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు!

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన చిరు జల్లులు పడ్డాయి. సూరారం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, కేపీహెచ్ కాలనీ, వివేకానంద నగర్, నిజాంపేట, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన పడింది.