CM KCR: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం: రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందన్న సీఎం కేసీఆర్

ధాన్యం కొనుగోలుపై తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

CM KCR: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం: రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందన్న సీఎం కేసీఆర్

Kcr

CM KCR: ధాన్యం కొనుగోలుపై తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్..తెలంగాణలో యాసంగి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆమేరకు బుధవారం నుంచే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, ధాన్యం కొనుగోలుపై గత కొన్ని రోజులుగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈక్రమంలో ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ “రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష” పేరుతో కేంద్రానికి వ్యతిరేకంగా సోమవారం భారీ నిరసన చేపట్టారు. ఢిల్లీలో దీక్ష ముగించుకొచ్చిన సీఎం కేసీఆర్ వెనువెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలుపై నెలకొన్న సందిగ్థతకు తెరదించారు. మంగళవారం కేబినెట్ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ పలు కీలక విషయాలు వెల్లడించారు.

Also read:KCR: ఇండియా వందేళ్లు వెనక్కి వెళ్లబోతోంది-కేసీఆర్

రంగారెడ్డి జిల్లా పరిధిలో జీఓ 111 ఎత్తివేస్తూ కాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మే 20 నుండి జూన్ 5 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆరు ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇవాలనీ నిర్ణయించినట్లు కేసీఆర్ వెల్లడించారు. వీటన్నిటికీ కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో నాలుగో పెద్ద ఎయిర్ పోర్ట్ గా గుర్తింపు ఉన్న శంషాబాద్ ఎయిర్ పోర్టులో సెంకండ్ రన్ వే ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. యూనివర్సిటీల్లో ఉద్యోగాల భర్తీకి విద్యాశాఖ అధ్వర్యంలో కామన్ బోర్డ్ ఏర్పాటుకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ వివరించారు. ఇక తెలంగాణాలో ధాన్యం కొనుగులోపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కరోనా సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 7000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని..దేశంలో ఎక్కడా లేనివిధంగా ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు.

Also Read:Pawan Kalyan in Anantapur: రైతుల కన్నీళ్లు కష్టాలు తీర్చలేనప్పుడు ఈప్రభుత్వాలు ఎందుకు: పవన్ కళ్యాణ్

రెండు పంటలు కలిపి తెలంగాణలో ఒక కోటి ఎకరాలలో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని ఆయన తెలిపారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం కేంద్రంలో ఉండటం దురదృష్టకరమని..కేంద్రానికి వ్యతిరేకంగా 13 నెలల పాటు రైతులు ఉద్యమం చేశారని కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని కుట్ర చేస్తోందని కేసీఆర్ ఆరోపించారు. ఎరువుల ధరలు పెంచిన కేంద్రం..దేశంలో వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే విధంగా విద్యుత్ మీటర్ల బిగింపుకు సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పండిన ధాన్యం విషయంలో కేంద్ర మంత్రులు చిల్లర మల్లరగా వ్యవహరిస్తున్నారని విమర్శించిన సీఎం కేసీఆర్..రాష్ట్రంలో వరి కోతలు మొదలయ్యాయని, యాసంగీ వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని స్పష్టం చేశారు.

Also read:supreme court : అటువంటి అమ్మ నాకొద్దు..నేను మాట్లాడను అంటూ..తల్లి పెట్టిన చిత్రహింసల్ని కోర్టు చెప్పిన 27 ఏళ్ల కొడుకు..

ఆమేరకు సివిల్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఊరిలో బుధవారం నుంచే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ వివరించారు. రైతులు తొందరపడి ధాన్యం అమ్ముకోవద్దని, ప్రతి గింజా ప్రభుత్వం కొంటుందని ఆయన స్పష్టం చేశారు. 1960 రూపాయల మద్దతు ధరతోనే ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేసారు. దేశంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ..కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీరామ నవమి రోజున గుజరాత్ లో రాళ్లు వేశారని, బెంగళూరు నాగరాణి నాశనం చేస్తున్నారని..భాజపా పాలనలో దేశం భారీ మూల్యం చెల్లించక తప్పదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. ఉన్మాదుల వలలో యువత పడితే దేశం వందేళ్లు వెనక్కి పోతుందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Also read;PM MoDi : ‘WTO అనుమతిస్తే ప్రపంచానికి ఆహారం అందించటానికి భారత్ సిద్ధంగా ఉంది’..