Palla Rajeshwar Reddy : ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి

పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి.. పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేత ప్రమాణం స్వీకారం చేయించారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

10TV Telugu News

sworn in as MLC : పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ప్రొటెం స్పీకర్‌ ఛాంబర్‌లో ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేత శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. పట్టభద్రులు ఎన్నికల్లో తనను గెలిపించిన అందరికీ రాజేశ్వర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో విజయం సాధించానని చెప్పారు.

‘మేమే తెలంగాణ తెచ్చామని కొందరు.. మేమే పోరాటం చేశామని మరి కొందరు ఎన్నికల్లో పోటీ చేశారు’ అని తెలిపారు. ప్రభుత్వ పాలన మెచ్చి ప్రజలు తనను గెలిపించారన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘన విజయం సాధించారు. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల స్థానం నుంచి పల్లా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

Telangana : కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీపై గవర్నర్ మార్క్ ట్విస్ట్

ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కవిత, వాణీదేవి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహా చార్యులు హాజరయ్యారు.