Yadadri Temple : యాదాద్రి క్యూ కాంప్లెక్స్‌లో పంది కలకలం

యాదాద్రి కొండపై పంది కలకలం సృష్టించింది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. క్యూ కాంప్లెక్స్ లో కాసేపు అటూ ఇటు పరిగెత్తింది. ఈ క్రమంలో క్యూ కాంప్లెక్స్ భవనం పైనుంచి పడి చనిపోయింది.

Yadadri Temple : యాదాద్రి క్యూ కాంప్లెక్స్‌లో పంది కలకలం

Yadadri Temple

Yadadri Temple : యాదాద్రి కొండపై పంది కలకలం సృష్టించింది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. క్యూ కాంప్లెక్స్ లో కాసేపు అటూ ఇటు పరిగెత్తింది. ఈ క్రమంలో క్యూ కాంప్లెక్స్ భవనం పైనుంచి పడి చనిపోయింది. పంది కళేబరాన్ని సిబ్బంది తొలగించింది. అడవి పంది ఆలయ మాడవీధుల్లోకి రావడంతో లఘు పుణ్యావచనం చేపడతామని అర్చకులు అన్నారు.

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో యాదాద్రి ఒకటి. దైవ దర్శనం కోసం భక్తులు తరలి వస్తుంటారు. యాదాద్రి ఆలయ పరిసరాలను ఎంతో పవిత్రంగా చూస్తారు. అలాంటి చోట అపచారం జరిగిపోయింది. ఓ అడవి పంది యాదాద్రి కొండపై హల్ చల్ చేసింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

శనివారం ఉదయం క్యూ లైన్ లో నుంచి ఆలయ మాడ వీధుల్లోకి వచ్చింది. అక్కడున్న జనాలను చూసిన పంది భయపడింది. అటూ ఇటూ పరిగెత్తడం ప్రారంభించింది. తప్పించుకునే క్రమంలో క్యూలైన్ కాంప్లెక్స్ పై నుంచి కిందకు దూకింది. పైనుంచి కింద పడటంతో పంది తీవ్రంగా గాయపడింది. దీంతో స్పాట్ లోనే చనిపోయింది. అడవి పందిని పట్టుకునేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, లాభం లేకపోయింది. పైనుంచి కింద పడి పంది చనిపోయింది. పంది కళేబరాన్ని ఎస్పీఎఫ్ సిబ్బంది అక్కడి నుంచి తొలగించింది.

Yadagiri Gutta : యాదాద్రిలో నిత్య పూజలు, దర్శన వివరాలు

పంది.. ఆలయ మాడ వీధుల్లోకి రావడాన్ని అపచారంగా భావించిన అర్చకులు.. లఘుపుణ్యావచనంతో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. దీని వల్ల దర్శనాలు ఆపాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాన ఆలయం వైపు ఎలాంటి ఇబ్బంది రాలేదని అర్చకులు తెలిపారు. కేవలం క్యూలైన్లు, మాడ వీధుల్లో మాత్రమే అడవి పంది తిరిగింది కాబట్టి.. ఆ ప్రాంతంలో మాత్రమే లఘుపుణ్యావచనం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

Tirumala : జులై 23న ఆన్‌లైన్‌లో వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత ప్ర‌త్యేక ద‌ర్శ‌నం కోటా విడుద‌ల