PM Modi Calls BandiSanjay : బండి సంజయ్‌కు ప్రధాని మోదీ ఫోన్.. శభాష్ అంటూ ప్రశంసల వర్షం
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. శభాష్ బండి.. కష్టపడి పని చేస్తున్నారు.. అంటూ ప్రశంసించారు.(PM Modi Calls BandiSanjay)

PM Modi Calls BandiSanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. శభాష్ బండి.. కష్టపడి పని చేస్తున్నారు.. అంటూ ప్రశంసించారు. ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడ సభ సక్సెస్ పై ప్రధాని మోదీ ఆరా తీశారు. పాదయాత్ర చేసిన కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారాయన. ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత పూర్తి చేసుకున్న బండి సంజయ్ కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. సాయి గణేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఖమ్మం వెళ్తుండగా మార్గం మధ్యలో బండి సంజయ్ కు ప్రధాని నుంచి కాల్ వచ్చింది. కష్టపడి పని చేస్తున్నారంటూ బండి సంజయ్ ను ప్రధాని మోదీ అభినందించారు.
Amit Shah : తెలంగాణను కేసీఆర్ అప్పుల్లో ముంచేశారు : అమిత్ షా
ప్రజా సంగ్రామ సేనతో పాటు పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తలకు అభినందనలు చెప్పాలని సంజయ్ తో మోదీ చెప్పారు. ‘‘మీ స్ఫూర్తితో.. మీ సూచనలతోనే పాదయాత్ర చేపట్టాను.. రెండు విడతల్లో కలిపి 770 కిలోమీటర్లు నడిచాను’’ అని మోదీకి చెప్పారు బండి సంజయ్. ‘‘నడిచింది నేనే అయినా.. నడిపించింది మీరే.. మీరు చెప్పిన ‘‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’’ పాలన రాష్ట్రంలో తెచ్చేందుకు పాదయాత్ర చేస్తున్నామని వివరించారు బండి సంజయ్.(PM Modi Calls BandiSanjay)

Bandi Sanjay
పాదయాత్రలో ప్రజలు ఏమంటున్నారు అని ప్రధాని అడగ్గా.. కేసీఆర్ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని బండి సంజయ్ ప్రధానికి తెలిపారు. కేంద్ర పథకాలు తెలంగాణలో అమలు చేయకుండా కేసీఆర్ తెరమరుగు చేసే కుట్ర చేస్తున్నారని బండి ఆరోపించారు. పేదల కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాలను తన పాదయాత్రలో వివరిస్తుండటంతో కేసీఆర్ పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని బండి సంజయ్ చెప్పారు. తెలంగాణలోనూ మీలాంటి నీతివంతమైన పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని బండి సంజయ్ వివరించారు.

Bandi Sanjay Padayatra
KTR On Early Elections : ముందస్తు ఎన్నికలకు మేము రెడీ.. మీకా దమ్ముందా? కేంద్రానికి కేటీఆర్ సవాల్
కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చానని ప్రధానికి తెలిపారు బండి సంజయ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డాల రాకతో కార్యకర్తల్లో మరింత జోష్ పెరిగిందని సంజయ్ చెప్పారు. రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ సూచనలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. మీ స్ఫూర్తితో కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం కష్టపడి పని చేస్తున్నారని ప్రధానికి తెలిపారు బండి సంజయ్. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేయడం, కష్టపడి పని చేస్తున్నారని ప్రశంసించడం పట్ల బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని ఫోన్ కాల్ బీజేపీ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపిందన్నారు.
శభాష్ బండి.. కష్టపడి పని చేస్తున్నారు.. @bandisanjay_bjp కు ప్రధానమంత్రి @narendramodi ఫోన్..
ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడ సభ సక్సెస్ పై ఆరా..
పాదయాత్ర చేసిన కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపిన ప్రధాని..
మరిన్ని వివరాల కోసం 👇https://t.co/rHBKpx1tXs pic.twitter.com/Me1eMog05h
— BJP Telangana (@BJP4Telangana) May 15, 2022
- Telangana Politics : కేసీఆర్ను టెన్షన్ పెట్టిస్తున్న పీకే..సర్వే రిపోర్టులతో గులాబీ బాస్ అలెర్ట్
- Telangana Police : బండి సంజయ్ కు షాక్ ఇచ్చిన తెలంగాణ పోలీసులు..
- Supreme Court : గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు
- PM Modi: “2024 ఎన్నికల తర్వాత దేశంలో రాష్ట్రాల సంఖ్య 50కు పెరుగుతాయ్”
- PM Modi Tweet : ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వంపై ప్రధాని మోదీ ట్వీట్
1Amma Vodi : నేడే ఖాతాల్లోకి డబ్బులు.. వీరందరికి అమ్మఒడి కట్..!
2New Fraud: ఇవాళ్టితో మీ కరెంట్ సప్లై ఆపేస్తాం.. కొత్త మోసం గురించి తెలుసుకోండి
3IndVsIreland T20I : భారత్, ఐర్లాండ్ టీ20 మ్యాచ్కి వరుణుడి ఆటంకం
4Telangana Corona Terror News : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
5Teacher Rajitha : హ్యాట్సాఫ్ టీచర్.. పిల్లలకు పాఠాలు చెప్పేందుకు కొండ కోనలు దాటి టీచరమ్మ సాహసం
6Agnipath: 57,000కు చేరిన అగ్నిపథ్ దరఖాస్తులు
7TS Inetr Results: ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. ఎప్పుడంటే..
8Assam Floods: అసోం వరదలు.. 127కు చేరిన మృతుల సంఖ్య
9Tragedy : సనత్నగర్లో దారుణం.. ఇంటి మందున్న చిన్నారిపై కారు ఎక్కించిన యువకులు
10Bank Holidays: జూలై నెలలో 14రోజులు బ్యాంకులు బంద్.. సెలవులు ఏఏ రోజంటే..
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!
-
CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
-
Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?