Massage Center : పేరుకే మసాజ్ సెంటర్.. జరిగేదంతా?
కొన్ని మసాజ్ సెంటర్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. గత కొద్దీ రోజులుగా మసాజ్ సెంటర్లలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల వరసగా వెలుగులోకి వస్తున్నాయి.

Massage Center
Massage Center : కొన్ని మసాజ్ సెంటర్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. గత కొద్దీ రోజులుగా మసాజ్ సెంటర్లలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు వరసగా వెలుగులోకి వస్తున్నాయి. రెండు నెలల క్రితం మాదాపూర్‌లో ఓ మసాజ్ సెంటర్‌లో వ్యభిచారం నిర్వహిస్తోండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఇక తాజాగా సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటువంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. మూసాపేట సమీపంలోని భవానీనగర్‌లో ఆర్ట్ స్పా సెంటర్ పేరిట భీమ్‌సింగ్ అనే వ్యక్తి మసాజ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు.
చదవండి : Massage Centers : స్పా సెంటర్..యువకులకు గాలం..పచ్చి వ్యభిచారం పోలీసులు దాడులు
ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టిన పోలీసులు సోమవారం రాత్రి దాడులు జరిపారు. నిర్వాహకుడు భీమ్‌సింగ్‌తో పాటు అతని ఇద్దరు అనుచరులు, ఓ విటుడు, కోల్‌కత్తాకు చెందిన ఆరుగురు యువతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
చదవండి : Semi nude massage : మసాజ్.. సెమీ న్యూడ్ మసాజ్, ఒక్కో సర్వీసుకు ఒక్కో రేటు