Rahul Gandi Bharat Jodo Yatra: బీజేపీ-టీఆర్ఎస్ రెండూ ఒకటే.. మోదీ చెప్పినట్లే కేసీఆర్ నడుస్తున్నారు..

ఎన్నికల ముందు కేసీఆర్ ఎన్నో డ్రామాలు ఆడతారు. కేసీఆర్ ఇక్కడ చెప్పేదొకటి.. ఢిల్లీలో చేసేది ఒకటి. మోదీతో కేసీఆర్ కు డైరెక్ట్ కనెక్షన్ ఉందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.

Rahul Gandi Bharat Jodo Yatra: బీజేపీ-టీఆర్ఎస్ రెండూ ఒకటే.. మోదీ చెప్పినట్లే కేసీఆర్ నడుస్తున్నారు..

Rahul Gandhi

Rahul Gandi Bharat Jodo Yatra: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటే. ప్రధాని మోదీ చెప్పినట్లే కేసీఆర్ నడుస్తున్నారు. కేసీఆర్ ఇక్కడ చెప్పేది ఒకటి.. ఢిల్లీలో చేసేది ఒకటి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం హైదరాబాద్ లో సాగింది. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్డులో జరిగిన కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేశారు.

KTR Vs Rahul Gandhi : సొంత నియోజకవర్గంలో ఎంపీగా గెలవలేని అంతర్జాతీయ నాయకుడు ప్రధాని అవుతారట : రాహుల్‌పై కేటీఆర్ సెటైర్లు

ఎన్నికల ముందు కేసీఆర్ ఎన్నో డ్రామాలు ఆడతారు. కేసీఆర్ ఇక్కడ చెప్పేదొకటి.. ఢిల్లీలో చేసేది ఒకటి. మోదీతో కేసీఆర్ కు డైరెక్ట్ కనెక్షన్ ఉందని రాహుల్ అన్నారు. పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ బిల్లుకూ టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని, టీఆర్ఎస్ బీజేపీని ప్రతీ విషయంలోనూ సమర్థిస్తోంది. బీజేపీ తెచ్చిన రైతు వ్యతిరేక బిల్లులకుసైతం టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని రాహుల్ విమర్శించారు. కేంద్రంలో రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత నిరుద్యోగులుగా మారుతున్నారని అన్నారు. రాష్ట్రంలో దేశంలో యువతకు ఉద్యోగాలు రావడం లేదు. ఇంజనీరింగ్ చదివిన వారి పరిస్థితి డెలివరీ బాయ్ ల్లా అయిపోయారంటూ రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. యేటా రెండు కోట్ల ఉద్యోగాలంటూ మోదీ ఊదరగొట్టారని, కానీ అధికారంలోకి వచ్చిన తరువాత యువతను మోసం చేస్తూనే వస్తున్నారని రాహుల్ విమర్శించారు. నోట్ల రద్దు, జీఎస్టీతో మధ్య తరగతి ప్రజల పొట్టకొట్టారని అన్నారు. గ్యాస్, పెట్రో ధరల పెంపు గురించి మోదీ ఎందుకు మాట్లాడరు అంటూ రాహుల్ ప్రశ్నించారు.

Bharat Jodo Yatra: టీఆర్ఎస్‌తో ఎలాంటి పొత్తులూ పెట్టుకోం.. ఎందుకంటే..?: రాహుల్ గాంధీ

పోర్టులు, ఎయిర్ పోర్టులు టెలికాం సంస్థలను మోదీ మిత్రులకు కట్టబెడుతున్నారు. ఇక శంషాబాద్ ఎయిర్ పోర్టు కూడా త్వరలో మోదీ మిత్రలు చేతుల్లోకి వెళ్తుందంటూ రాహుల్ ఆరోపించారు. టీఆర్ఎస్ పాలన అవినీతి మయం అయిందని విమర్శించారు.  హైదరాబాద్ లో రోడ్లు తక్కువ గుంతలు ఎక్కువ అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. ధరణి పోర్టల్ కూడా ఓ మోసం అంటూ రాహుల్ విమర్శించారు. భారత్ జోడో యాత్రలో విధ్వేషాలు కనిపించవు. ఈ యాత్రను ఏ శక్తి ఆపలేదంటూ రాహుల్ పేర్కొన్నారు.