Telangana : హైదరాబాద్‌‌లో భారీ వర్షం కురిసే అవకాశం..జాగ్రత్త

ఇప్పటికే పడుతున్న వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే..వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. మరోసారి భారీ వర్షం పడనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Telangana : హైదరాబాద్‌‌లో భారీ వర్షం కురిసే అవకాశం..జాగ్రత్త

Hyd Rain

Rains In Hyderabad : తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా హైదారబాద్ మహానగరంలో వర్షం పడుతూనే ఉంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా..పలు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే పడుతున్న వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే..వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది.

Read More : Bblind Therapy Dog : కాళ్లు కట్టేసి బుల్లెట్లతో తూట్లు పొడిచినా..హాని చేసిన మనషులకు సేవ చేస్తున్న గ్రేట్ డాగ్..

మరోసారి భారీ వర్షం పడనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సాయంత్రం 06 గంటల నుంచి 8 గంటల మధ్యలో భారీ వర్షం పడుతుందని తెలిపారు. ఈ క్రమంలో..ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, రోడ్లపై వెళ్లే సమయంలో..తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఉదయం నుంచి కురుస్తున్న వర్షం..మరో 8 గంటల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Read More : Apple iPhone : టెక్‌ దిగ్గజం యాపిల్‌కి షాక్‌..​ దారుణంగా పడిపోయాయి

ప్రజలు తప్పకుండా ఇళ్లలోనే ఉండాలని, ఏదైనా అత్యవసరం అయితే..తప్పా…బయటకు రావొద్దన్నారు. ఏదైనా సహాయం కావాలనుకున్న వారు…040-2955 5500 నంబర్ నుం సంప్రదించాలని సూచించారు. 2021, సెప్టెంబర్ 06, 07వ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, బంగాళాఖాతంపై గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం ఉందని అధికారులు తెలిపారు. రుతుపవనాల గాలుల ద్రోణి..ఢిల్లీ, బాలంగీర్, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు వ్యాపించిందని, భూమికి 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలుల్లో అస్థిరత ఏర్పడిందని..దీని కారణంగా…తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు.