Rave Party : హైదరాబాద్‌ శివారులో రేవ్ పార్టీ..12మంది యువతీయువకుల అరెస్ట్

12మంది యువతీయువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురు అమ్మాయిలు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో హుక్కా, మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Rave Party : హైదరాబాద్‌ శివారులో రేవ్ పార్టీ..12మంది యువతీయువకుల అరెస్ట్

Rave party : హైదరాబాద్‌ శివారులో రేవ్ పార్టీ కలకలం రేగింది. అబ్దుల్లాపూర్‌మెట్టు పీఎస్‌ పరిధిలోని లష్కర్‌గూడ సమీపంలో ఓ ప్రైవేట్ గెస్ట్ హౌజ్‌లో రేవ్‌ పార్టీ జరిగింది. అయితే విషయం తెలుసుకున్న రాచకొండ పోలీసులు పార్టీని భగ్నం చేశారు.

12మంది యువతీయువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురు అమ్మాయిలు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో హుక్కా, మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Rave Party : అడవిలో అర్ధరాత్రి రేవ్ పార్టీలు

రేవ్‌ పార్టీని వనస్థలిపురంకి చెందిన ఓ మహిళ ఆర్గనైజ్‌ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు రేవ్‌పార్టీ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.