Revanth Reddy Slams CM : రేప్ కేసు.. కేసీఆర్, ఓవైసీ ఎందుకు స్పందించలేదు? దాడులు చేస్తామని రేవంత్ రెడ్డి వార్నింగ్

వారం పది రోజుల్లో ఎన్నో గ్యాంగ్ రేప్ లు జరిగాయి. వీటన్నింటికి కారణం గంజాయి, పబ్ లే. ప్రభుత్వం పట్టించుకోకపోతే దాడులకు దిగుతామని హెచ్చరించారు.(Revanth Reddy Slams CM)

Revanth Reddy Slams CM : రేప్ కేసు.. కేసీఆర్, ఓవైసీ ఎందుకు స్పందించలేదు? దాడులు చేస్తామని రేవంత్ రెడ్డి వార్నింగ్

Revanth Reddy Slams Cm

Revanth Reddy Slams CM : సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ కేసుకి సంబంధించి సీపీ సీపీ ఆనంద్ వెల్లడించిన వివరాలపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం, పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పిన విధానం చూస్తుంటే, అవసరమైన వాళ్లందరిని తప్పించే ప్రయత్నం చేసినట్లుగా ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఈ ఘటనలో నిందితులు, బాధితురాలు ప్రయాణించిన బెంజ్ కారు, ఇన్నోవా ముఖ్యమైన ఆధారాలు అని రేవంత్ రెడ్డి చెప్పారు. మైనర్లు వాహనాలు నడిపితే యజమానులకు సమాచారం అందించాలన్నారు. ఎంవీ యాక్ట్ ప్రకారం యజమానులను పోలీస్ స్టేషన్ కు పిలవాలి, లేదంటే వాళ్లపై కేసులు పెట్టాల్సిందన్నారు. కానీ, పోలీసులు అదేమీ చేయలేదన్నారు. యజమానులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు.(Revanth Reddy Slams CM)

CV Anand : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. పక్కా ప్లాన్ ప్రకారమే అత్యాచారం, అసలేం జరిగిందంటే..

ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తున్న వక్ఫ్ బోర్డ్ చైర్మన్, ఎంఐఎం నేతల పిల్లలు ఈ కేసులో ఉన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రెండు పార్టీలు.. అధికార భాగస్వామ్యంలో ఉన్నాయన్నారు. ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నారు, రేపులు మర్డర్లలో కూడా టీఆర్ఎస్, ఎంఐఎం భాగస్వామ్యం అవుతాయా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

ఇన్నోవాను మైనర్ నడిపి ఉంటే, ఎంవీ యాక్ట్ ప్రకారం విచారణ చేశారా? అని పోలీసులను ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. వాహనం ఎవరిదో స్పష్టం చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఉపయోగించాల్సిన కారును అసాంఘిక కార్యకలాపాల కోసం వాడటం దారుణం అన్నారు. అసలు వాహనాలు ఎవరివి? ఎందుకు వాళ్లను కాపాడుతున్నారు? అని రేవంత్ రెడ్డి పోలీసులను నిలదీశారు. రేప్ చేయటమే కాకుండా, ఆధారాలను తొలగించే ప్రయత్నం చేశారని రేవంత్ ఆరోపించారు. కేసును బలహీనపరిచి, నిందితులను శిక్ష నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సీవీ ఆనంద్.. తప్పించుకునేలా సమాధానాలు చెప్పారని అన్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

”హైదరాబాద్ లో జరుగుతున్న సంఘటనలు బ్రాండ్ ఇమేజ్ ని తగ్గిస్తున్నాయి. వారం పది రోజుల్లో ఎన్నో గ్యాంగ్ రేప్ లు జరిగాయి. వీటన్నింటికి కారణం గంజాయి, పబ్ లే. లిక్కర్ అమ్మకం ద్వారా ఆదాయం సంపాదించుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. మైనర్లను అనుమతిస్తున్న పబ్ యజమానులపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులోనూ నిజమైన యజమానిని తప్పించారు. వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ పై కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదు? మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు సమీక్ష చేయలేదు? జాతీయ, అంతర్జాతీయ అంశాలపై స్పందించే ఓవైసీ.. మైనర్ బాలిక రేప్ విషయంలో ఎందుకు స్పందించరు? పబ్బులు, డ్రగ్స్ పై ముఖ్యమంత్రికి సీపీ నివేదిక ఇచ్చారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు రేవంత్ రెడ్డి.

CV Anand On Punishment : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులకు ఉరిశిక్ష..?

హైదరాబాద్ ను రక్షించుకునే బాధ్యత కాంగ్రెస్ ది అని రేవంత్ రెడ్డి అన్నారు. పబ్ లపై దాడి చెయ్యాలని ఎన్ ఎస్ యూఐకి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎయిర్ పోర్టు దగ్గర నిర్వహిస్తున్న పబ్బులు.. బ్రోతల్ హౌస్ లను మించిపోతున్నాయన్నారు. జయేష్ రంజన్ సహకరిస్తున్నట్లు సమాచారం ఉందన్న రేవంత్ రెడ్డి జయేష్ రంజన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రు. వెంటనే ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించాలని, ఎయిర్ పోర్టు వద్ద పబ్ ల అనుమతులు రద్దు చెయ్యాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అసాంఘిక కార్యలాపాలకు హైదరాబాద్ అడ్డాగా మారిందని రేవంత్ వాపోయారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే పబ్ లపై దాడులకు దిగుతామని హెచ్చరించారు.