sagar bypoll : ఎన్నికల ప్రచారంలో సిత్రాలు, నిన్న ఏడుపులు, నేడు చిందులు

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో అభ్యర్థులు దూసుకపోతున్నారు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

sagar bypoll : ఎన్నికల ప్రచారంలో సిత్రాలు, నిన్న ఏడుపులు, నేడు చిందులు

Ravi Kumar Naik

bjp candidate ravi naik : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో అభ్యర్థులు దూసుకపోతున్నారు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అయితే..ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ గా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న…రవి నాయక్ కు సంబంధించిన ప్రచారం వీడియోలు నెట్టింట్ల హాల్ చల్ చేస్తున్నాయి. మొన్న భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న రవి నాయక్..నేడు చిందులు తొక్కడం విశేషం. గ్రామాల్లో కోలాటం, బతుకమ్మ ఆడుతూ..తనకే ఓటు వేయాలంటున్నారు. గిరిజన బిడ్డను ఆశీర్వదించాలని కోరుతున్నారు.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి..మార్చి 30 వరకు నామినేషన్లు స్వీకరించారు. మార్చి 31న నామినేషన్ల పరిశీలన చేశారు. ఏప్రిల్‌ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిపోయింది. 17న ఉప ఎన్నిక పోలింగ్‌, మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, టీఆర్ఎస్ తరపున దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్, బీజేపీ నుంచి పనుగోతు రవి కుమార్ లు పోటీ చేస్తున్నారు. మొత్తం 19 మంది తమ నామినేషన్లు వెనక్కితీసుకున్నారు. దీంతో 41 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. 77 మంది నామినేషన్లు దాఖలు చేశారు. గత నెల 31వ తేదీన జరిగిన నామినేషన్ల పరిశీలనలో 17 తిరస్కరణకు గురికాగా, శనివారం 19 మంది విత్‌డ్రా చేసుకున్నారు. మరి రవి నాయక్ ను ప్రజలు ఆశీర్వదిస్తారా ? లేదా ? అనేది చూడాలి.