Schools Reopen : మోగిన బడి గంట.. స్కూల్స్ రీఓపెన్, ఇంగ్లీష్ మీడియంలో బోధన

రాష్ట్రంలోని 41,392 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తెరుచుకున్నాయి. 59 లక్షలకు పైగా విద్యార్థులు బడిబాట పట్టారు. ఈ విద్యా సంవత్సరం నుంచి సర్కారీ బడుల్లో 1-8 తరగతులకు ఇంగ్లీష్‌ మీడియంలో బోధన చేయనున్నారు.

Schools Reopen : మోగిన బడి గంట.. స్కూల్స్ రీఓపెన్, ఇంగ్లీష్ మీడియంలో బోధన

Schools Reopen

Schools Reopen : తెలంగాణ రాష్ట్రంలో బడి గంట మోగింది. పిల్లలు మళ్లీ బడి బాట పట్టారు. సోమవారం నుంచి రాష్ట్రంలో స్కూళ్లు పున:ప్రారంభం అయ్యాయి. వేసవి సెలవులు ముగియడంతో షెడ్యూల్ ప్రకారమే జూన్ 13 నుంచి బడులు తిరిగి ప్రారంభం అయ్యాయి. కాగా, ఎండలు ఎక్కువగా ఉండటం, కరోనా కేసులు పెరుగుతుండటంతో స్కూళ్లకు వేసవి సెలవులను ప్రభుత్వం పొడిగించే యోచనలో ఉందనే వార్తలు వచ్చాయి. అయితే, షెడ్యూల్ ప్రకారమే బడులు తెరుస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

రాష్ట్రంలోని 41 వేల 392 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు నేడు తెరుచుకున్నాయి. 59 లక్షలకు పైగా విద్యార్థులు బడిబాట పట్టారు. బడి బాటలో భాగంగా 70 వేల 698 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1-8 తరగతులకు ఇంగ్లీష్‌ మీడియంలో బోధన చేయనున్నారు. ఇందుకోసం 1.04 లక్షల మంది టీచర్లకు అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సీటీ ద్వారా శిక్షణ ఇచ్చారు.

Minister Sabita Indrareddy : రేపటి నుంచి స్కూల్స్ రీఓపెన్..1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ బోధన : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు స్వాగతం పలకాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. గ్రామాల్లో సర్పంచులు, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, చైర్మన్లు విద్యార్థులను స్వాగతించాలని కోరారు. ఇవాళ ఉదయం 9 గంటలకు హైదరాబాద్ గన్ ఫౌండ్రీలోని మహబూబియా బాలికల పాఠశాల, అలియా ప్రాథమిక పాఠశాలలో.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులు స్వాగతం పలకనున్నారు.