Secunderabad Violence Loss : సికింద్రాబాద్ విధ్వంసం.. రైల్వేశాఖకు రూ.12కోట్ల ఆస్తి నష్టం

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన అల్లర్లలో రైల్వేశాఖకు భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు రైల్వే డివిజనల్ మేనేజర్ గుప్తా చెప్పారు.

Secunderabad Violence Loss : సికింద్రాబాద్ విధ్వంసం.. రైల్వేశాఖకు రూ.12కోట్ల ఆస్తి నష్టం

Secunderabad Violence Loss

Secunderabad Violence Loss : శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన అల్లర్లలో రైల్వేశాఖకు భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు రైల్వే డివిజనల్ మేనేజర్ గుప్తా చెప్పారు. రైల్వే కోచ్ లు, రైల్వే లోకోమోటివ్ లతో పాటు ప్లాట్ ఫామ్స్ పైన భారీగా నష్టం వాటిల్లిందని చెప్పారు. డైరెక్ట్ డ్యామేజ్ రూ.12కోట్ల మేర ఉంటుందన్నారు. ఇండైరెక్ట్ డ్యామేజ్ అంతకుమించి ఉంటుందన్నారు. అయితే, పవర్ కార్ కు భారీగా ప్రమాదం తప్పిందన్నారు. అదే పవర్ కార్ కు మంటలు అంటుకుని ఉంటే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగి ఉండేదన్నారు.(Secunderabad Violence Loss)

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో హింసాత్మక ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. రూ.12కోట్ల ఆస్తి నష్టం జరిగింది. పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేస్తున్నాం. సంఘటనపై దర్యాఫ్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. 5 రైల్ ఇంజిన్లు, 30 బోగీలు ధ్వంసం అయ్యాయి.

Sai Defence Academy : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం.. పోలీసుల అదుపులో దాడుల సూత్రధారి?

పార్సిల్ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. డీజిల్ ట్యాంకర్ కు భారీగా ప్రమాదం తప్పింది. ట్యాంకర్ కు మంటలు అంటుకుని ఉంటే భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగుండేది. ప్రస్తుతం అన్ని రైల్వే గూడ్స్ ను పునరుద్ధరించాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రైళ్లు రద్దైన నష్టంపై అంచనా వేస్తున్నాం. రైళ్లలో తరలిస్తున్న ప్రయాణికుల సామగ్రి భారీగా ధ్వంసమైంది.

భారత సాయుధ దళాల్లో నాలుగేళ్ల స్వల్పకాలిక ఉద్యోగ నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ విధానం అగ్గి రాజేసింది. తీవ్ర హింసకు దారితీసింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు భగ్గుమంటున్నాయి. ఆర్మీ ఆశావహులు నిరసనలకు దిగుతూ పలు రైళ్లకు నిప్పంటించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనూ ఆందోళనకారులు రైలును అగ్నికి ఆహుతి చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.

అగ్నిపథ్ స్కీమ్ కి వ్యతిరేకంగా యువత రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ‘అగ్నిపథ్’ ద్వారా నాలుగేళ్లు మాత్రమే ఆర్మీలో పని చేసే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. యువతలో తీవ్ర ఆగ్రహానికి ఇదే ప్రధాన కారణం అవుతోంది. ఈ నిబంధనను నిరసిస్తూ యువత రోడ్డెక్కింది. ఆందోళన బాట పట్టింది. పలు రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. బీహార్ రాష్ట్రంలో నిరసనకారులు రైళ్లకు నిప్పంటించారు. హర్యానాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసకాండ జరిగింది.

పెద్దఎత్తున తరలివచ్చిన ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడ్డారు. రైళ్లకు నిప్పుపెట్టారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జి చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో ఒకరు మృతిచెందగా, 15 మంది వరకు గాయపడ్డారు.

మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం వెనుక భారీ కుట్ర కోణాన్ని వెలికితీసిన పోలీసులు హింసాత్మక ఘటనలకు కారణమైన వారిని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు. సాయి డిఫెన్స్ అకాడెమీ డైరెక్టర్ సుబ్బారావుని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు నరసరావుపేట పోలీసులు. ప్రకాశం జిల్లా కంభంలో సుబ్బారావుని అదుపులోకి తీసుకుని నరసరావు పేట టుటౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి సుబ్బారావుని భిన్న కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.