Telangana Politics : తెలంగాణపై ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్?

టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమంటున్న కమళం పార్టీ నేతలు మరింత జోష్ పెంచారు. ఇక సీఎం కేసీఆర్ ప్రకటించిన పీపుల్స్ ఫ్రంట్ కు తమ దూకుడుతో చెక్ పెట్టాలని బీజేపీ చూస్తోంది.

Telangana Politics : తెలంగాణపై ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్?

Telangana

five state election results : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలపై ఎఫెక్ట్ చూపనున్నాయా? యూపీ విజయంతో దూకుడు మీదున్న కమళనాథులు తమ నెక్ట్స్ తెలంగాణ అంటూ ఇప్పటికే స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమంటున్న కమళం పార్టీ నేతలు మరింత జోష్ పెంచారు. ఇక సీఎం కేసీఆర్ ప్రకటించిన పీపుల్స్ ఫ్రంట్ కు తమ దూకుడుతో చెక్ పెట్టాలని బీజేపీ చూస్తోంది.

మరోవైపు ఐదు రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలను చూస్తే కాంగ్రెస్ పార్టీ మరింత చతికిలపడ్డట్లుగా క్లియర్ కట్ గా అర్థమవుతోంది. అధికారంలో ఉన్న పంజాబ్ లో హస్తం నేతలు తిరిగి గెలుపు సాధించలేకపోయారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చతికిలపడింది. పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దారుణ ఓటమిని చవి చూసింది. ఇక పంజాబ్ లో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తెలంగాణపై నజర్ పెడుతున్నట్లు సమాచారం.

Goa BJP : గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ రెడీ!

తెలంగాణ కాంగ్రెస్ లో సైతం రోజు రోజుకు గళం విప్పుతున్న నేతల సంఖ్య పెరుగుతూనేవుంది. తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్త నేతలు గళం విప్పుతున్నారు. తీరు మారకపోతే కాంగ్రెస్ కథ కంచికి చేరడం ఖాయమని సీనియర్ నేతలు అంటున్నారు. దీంతో కాంగ్రెస్ అసంతృప్త నేతలపై బీజేపీ నజర్ పెడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే టీఆర్ఎస్ అసంతృప్త నేతలపై కూడా బీజేపీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మూడో ఫ్రంట్ ఏర్పాటుకు సవాల్ గా బీజేపీ దూకుడుగా ఉంది.

మరోవైపు తెలంగాణపై ఆప్ ఫోకస్ చేపే అవకాశం ఉంది. గతంలో కోదండరామ్ తో ఆప్ నేతలు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ పీపుల్స్ ఫ్రంట్ పై ఆసక్తి నెలకొంది. గత కొంతకాలంగా తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీకి ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ ఏర్పాటు దిశగా సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. పలు బహిరంగ సభల్లో కేంద్రంలోని బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీని ఓడించాలని, బంగాళాఖాతంలో కలపాలని కూడా పిలుపునిచ్చారు.

AAP in Punjab: పంజాబ్ ను కైవసం చేసుకున్న “ఆమ్ ఆద్మీ”: సక్సెస్ సీక్రెట్

ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, తమిళనాడు సీఎం స్టాలిన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీలతోపాటు పలువురు నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. పలు మీటింగ్స్ లోనూ మూడో ఫ్రంట్ ప్రస్తావన పదే పదే తీసుకొచ్చారు సీఎం కేసీఆర్. ఆ మేరకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. తెలంగాణలోనూ టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరా పోరు సాగుతోంది. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకవైపు తెలంగాణలో బలపడి పాగా వేయాలని బీజేపీ చూస్తోంది. మరోవైపు బీజేపీని వెనక్కి కొట్టాలని టీఆర్ఎస్ చూస్తోంది.

ఇరువురు పరస్పరం తీవ్ర విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం డంకా మోగించింది. పంజాబ్ తప్ప, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. దీంతో బీజేపీ మంచి జోస్ లో ఉంది. ఇప్పటికే తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయ రాజకీయాలపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

KTR : కేసీఆర్‌ను ఒక్కమాట అన్నా ఫిరంగులై గర్జిద్దాం- బీజేపీపై కేటీఆర్ ఫైర్

యూపీ, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. యూపీని మరోసారి బీజేపీ దక్కించుకుంది. మణిపూర్ లో కమళం పార్టీ అధికారం చేజిక్కించుకుంది. ఉత్తరాఖండ్ లో కూడా బీజేపీ విజయం సాధించింది. పంజాబ్ ను మాత్రం ఆప్ కైవసం చేసుకుంది. గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది.