Chikoti Praveen: నా కారు చోరీ సాధారణ దొంగతనం కాదు: చికోటి ప్రవీణ్

తన కారు చోరీ సాధారణ దొంగతనం కాదని కేసినో కింగ్ చికోటి ప్రవీణ్ అన్నారు. 10టీవీతో ఆయన ఇవాళ మాట్లాడారు. తనకు ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని చెప్పారు. కొంత కాలంగా రెక్కీ నిర్వహిస్తున్నారని అన్నారు. పోలీసులు విచారణ జరిపి తనకు భద్రత పెంచాలని చెప్పారు. తనపై ఈడీ విచారణ కొనసాగుతోందని, కేసినో నిర్వహిస్తునే ఉన్నానని అది తన ప్రొఫెషన్ అని తెలిపారు.

Chikoti Praveen: నా కారు చోరీ సాధారణ దొంగతనం కాదు: చికోటి ప్రవీణ్

Chikoti Praveen

Chikoti Praveen: తన కారు చోరీ సాధారణ దొంగతనం కాదని కేసినో కింగ్ చికోటి ప్రవీణ్ అన్నారు. 10టీవీతో ఆయన ఇవాళ మాట్లాడారు. తనకు ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని చెప్పారు. కొంత కాలంగా రెక్కీ నిర్వహిస్తున్నారని అన్నారు. పోలీసులు విచారణ జరిపి తనకు భద్రత పెంచాలని చెప్పారు. తనపై ఈడీ విచారణ కొనసాగుతోందని, కేసినో నిర్వహిస్తునే ఉన్నానని అది తన ప్రొఫెషన్ అని తెలిపారు.

ప్రభుత్వానికి టాక్స్ లు చెల్లించి లీగల్ గానే కేసినో నడుపుతున్నానని చికోటి ప్రవీణ్ చెప్పారు. హిందుత్వం కోసం కేసినోను వదులుకోడానికి తాను సిద్ధమని తెలిపారు. అవకాశం ఉంటే రాజకీయాల్లోకి రావడానికి సన్నద్ధంగా ఉన్నానని అన్నారు. త్వరలో రాజకీయాల్లోకి వచ్చే దానిపై ప్రకటన కూడా చేస్తానని తెలిపారు.

తనకు భద్రత కల్పించాలని హైకోర్టు పిటిషన్ వేశానని, డీజీపీని కలిసి మరోసారి ఫిర్యాదు చేస్తానని అన్నారు. కాగా, చికోటి ప్రవీణ్ కేసినో కేసులో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా, ఆయన ఇంటి వద్ద కారు చోరీ కావడం కలకలం రేపింది. సైదాబాద్‌ లోని ఆయన కారును దుండగులు చోరీ చేసి తీసుకెళ్లారు. అంతకుముందు రెక్కీ నిర్వహించారు. చికోటి ప్రవీణ్ దీనిపై పోలీసులకు పిర్యాదు చేశారు.

KA Paul: తెలంగాణలో అవినీతిపై కేసీఆర్ నాతో చర్చకు రావాలి: కేఏ పాల్