MLC Kavitha: సుప్రీంకోర్టులో కవితకు చుక్కెదురు.. 24నే విచారిస్తామన్న సీజేఐ ధర్మాసనం

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. మహిళలను ఈడీ కార్యాలయంలో విచారించడం‌పై సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ ను త్వరగా విచారించాలని కవిత తరపు న్యాయవాదులు కోరారు. కానీ, గతంలో చెప్పిన విధంగా మార్చి 24నే విచారిస్తామని సిజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది.

MLC Kavitha: సుప్రీంకోర్టులో కవితకు చుక్కెదురు.. 24నే విచారిస్తామన్న సీజేఐ ధర్మాసనం

MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 11న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారించిన విషయం విధితమే. ఈడీ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు విచారణ కొసాగింది. 16న మరోసారి విచారణకు హాజరు కావాలని ఈడీ కవితకు సూచించింది. అయితే, 16న ఉదయం తాను విచారణకు హాజరుకాలేనని ఈడీకి మెయిల్ ద్వారా కవిత సమాచారం ఇచ్చారు. ఈడీ విచారణపై స్టే కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ పెండింగ్‌లో ఉందని, అనారోగ్యం కారణంగా మార్చి 24 వరకూ సమయం ఇవ్వాలని ఈడీని కవిత కోరింది. అయితే కవిత అభ్యర్థనను ఈడీ అధికారులు తిరస్కరించారు. ఈనెల 20న మరోసారి విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది.

MLC Kavitha : ఈడీ నోటీసులు.. మరోసారి సుప్రీంకోర్టుకు కవిత, ఊరట దక్కేనా?

ఈడీ విచారణ నుండి తనకు స్టే ఇవ్వాలని కోరుతూ గతంలో సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా, ఈనెల 24న విచారస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఇదే సమయంలో ఈనెల 20న మరోసారి విచారణకు రావాలని ఈడీ కవితకు నోటీసులు ఇవ్వడంతో మరోసారి కవిత సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. మహిళలను ఈడీ కార్యాలయంలో విచారించడం‌పై సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్‌ను త్వరగా విచారించాలని కవిత తరపు న్యాయవాదులు విజ్ఞప్తిచేశారు. అయితే, అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ముందుగా చెప్పినట్లుగానే మార్చి 24న విచారిస్తామని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు.. ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని ఆదేశం

సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కవిత ఈ నెల 20న ఈడీ విచారణకు వెళ్తారా? లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టులో తన పిటీషన్ పెండింగ్ లో ఉందని ఈనెల 16న విచారణకు హాజరుకాని కవిత, ఈ నెల 20వ తేదీకూడా ఇదే విధానాన్ని అనుసరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజా సుప్రీం సూచనతో కవిత ఈడీ విచారణకు హాజరయ్యే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశం ఆసక్తికరంగా మారింది.