Telangana BJP : కేసీఆర్‌‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్

ప్రొఫెసర్ జయ శంకర్ ను సీఎం కేసీఆర్ మర్చిపోయారని, ఆయన్ను అవమాన పరిచిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. జయ శంకర్ లేకపోతే...

Telangana BJP : కేసీఆర్‌‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్

Bandi Sanjay

Telangana BJP President Bandi Sanjay : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ముందుగానే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా బీజేపీ – టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. కేంద్రంపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. దీంతో బీజేపీ కౌంటర్ ఇస్తోంది. 2022, ఫిబ్రవరి 16వ తేదీ బుధవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ జరుపుతున్న ఆందోళనకు ఆకర్షితులై, టీఆర్ఎస్ పై పోరాటం కోసం పార్టీలో చేరిన నేతలకు స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ముక్త్ తెలంగాణ కోసం ‘యువ తెలంగాణ పార్టీ’ బీజేపీలో విలీనం అయ్యిందన్నారు.

Read More : CM KCR : ఈనెల 20న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తధ్యమని జోస్యం చెప్పారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయడానికి దేశ రాజకీయాల గురించి కేసీఆర్ మాట్లాడుతున్నరని విమర్శించారు. చర్చల్లో ఉండటానికి సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడుతున్నారని, రాజ్యాంగం గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే సర్జికల్ స్ట్రైక్స్ లాంటి అంశాలతో ప్రజల దృష్టి మరలిస్తున్నారని విమర్శించారు. జన్మదినం సందర్భంగా కేసీఆర్ మంచి వ్యాఖ్య చేయాల్సిన అవసరం ఉందన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ గురించి తాను చేసిన వ్యాఖ్యలు తప్పు అని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 10 జన్ పథ్ స్క్రిప్ట్ కు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ తెలిపారు.

Read More : BJP Chief Bandi Sanjay : రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోంది-బీజేపీ చీఫ్ బండి సంజయ్

ప్రపంచానికి ఉద్యమ స్ఫూర్తిని నింపిన ప్రాంతం తెలంగాణ అని, అన్నింటిని భరించి, తెగించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ప్రొఫెసర్ జయ శంకర్ ను సీఎం కేసీఆర్ మర్చిపోయారని, ఆయన్ను అవమాన పరిచిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. జయ శంకర్ లేకపోతే తెలంగాణ సిద్దించేదా అని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికలు వస్తేనే కేసీఆర్ కి హామీలు, సమస్యలు గుర్తుకు వస్తాయని, ఎక్కడ ఎన్నికలు వచ్చినా మోటార్లకు మీటర్లు పెడతారని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో కేంద్రమంత్రి స్పష్టత ఇచ్చారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యుత్ చట్టాల విషయంలో ప్రజలను తప్పేదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.

Read More : Dear KCR Garu: ‘కేసీఆర్ గారూ.. సర్జికల్ స్ట్రైక్‌పై ఇదిగో సాక్ష్యం’

తెలంగాణ ఆకాంక్షలకు భిన్నంగా ఒకే కుటుంబం రాష్ట్రంలో రాజ్యమేలుతోందని విమర్శించారు. గత ఏడాది సీఎం కేసీఆర్ 145 రోజులు ఫామ్ హౌస్ లో ఉన్నారని ఆర్టీఐ ద్వారా తెలిసిందని, పండుగలు, ఆదివారాలు తీసేస్తే సుమారు 200 రోజులు ఫామ్ హౌస్ లో ఉన్నారని ఆరోపించారు. దేశంలో ఫామ్ హౌస్ లో ఉండే సీఎం కేసీఆర్ ఒక్కరేనని, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం పోరాడుతున్న పార్టీ బీజేపీనని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కేసులు పెట్టినా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. డిస్కంలకు చెల్లించాల్సిన 48 వేల కోట్లు బీజేపీ అధికారంలోకి వచ్చాక చెల్లిస్తుందని, ఇంకా అనేక మంది బీజేపీలో చేరనున్నారని, ఉద్యమ కారులంతా ఏకమై తెలంగాణ కోసం పోరాడుతామని బండి సంజయ్ స్పష్టం చేశారు.