Bandi Sanjay : టీచర్ల అరెస్టును ఖండించిన బండి సంజయ్, వెంటనే విడుదల చేయాలని డిమాండ్

అరెస్ట్ చేసిన టీచర్లందరినీ ప్రభుత్వం తక్షణమే భేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ‘స్థానికత’కు గొడ్డలిపెట్టుగా ఉన్న 317 జీవోను వెంటనే సవరించాలన్నారు.

Bandi Sanjay : టీచర్ల అరెస్టును ఖండించిన బండి సంజయ్, వెంటనే విడుదల చేయాలని డిమాండ్

Bandi Sanjay

Bandi Sanjay : 317 జీవోను సవరించాలంటూ ప్రగతి భవన్ దగ్గర శాంతియుతంగా ఆందోళన చేస్తున్న టీచర్లను అరెస్టు చేయడాన్ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ చేసిన టీచర్లందరినీ ప్రభుత్వం తక్షణమే భేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ‘స్థానికత’కు గొడ్డలిపెట్టుగా ఉన్న 317 జీవోను వెంటనే సవరించాలన్నారు. 317 జీవోను సవరించే దాకా ఉద్యోగ, ఉపాధ్యాయులు చేసే ఉద్యమానికి బీజేపీ అండగా ఉంటుందని ఆయన చెప్పారు. 317 జీవోను సవరించే దాకా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు బండి సంజయ్.

Ghosts Exist : అవును.. దెయ్యాలున్నాయి.. ఐఐటీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

317 జీవో. ప్రస్తుతం తెలంగాణలో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న అంశం. కొత్త జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపుపై 317 జీవో ప్రకారమే మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ జీవోపై పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గవర్నమెంట్‌ ఆర్డర్‌ను సవరించాలని.. స్థానికతను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నది వారి డిమాండ్‌. భార్యాభర్తల కేసులను ముందే పరిష్కరించి.. వితంతువులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయా సంఘాలు కోరుతున్నాయి.

కేడర్​ విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో 317ను తీసుకొచ్చింది. జీవో తెచ్చినప్పటి నుంచి వివాదం నడుస్తోంది. స్థానికత అంశమే ఇందులో లేకపోవడం, ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా సీనియారిటీ లిస్టులు ప్రిపేర్​ చేయడం, అంతర్ జిల్లా బదిలీలు, స్పౌజ్ కేసులపై క్లారిటీ ఇవ్వకపోవడంపై టీచర్లు, ఎంప్లాయీస్ భగ్గుమంటున్నారు. జీవోలోని అంశాలు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నాయని అంటున్నారు.

Block Unknown Numbers : ఈ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గుర్తుతెలియని నెంబర్లను ఇలా బ్లాక్ చేయండి..!

జూనియర్​ ఉద్యోగులైతే తాము స్థానికతను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవోను రద్దు చేయాలంటూ ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలన్నింటితో చర్చించకుండా కేవలం టీజీవో, టీఎన్జీవో సంఘాలతోనే చర్చించి ఇష్టమున్నట్లు గైడ్​లైన్స్​ రూపొందించాలని ఉద్యోగులు మండిపడుతున్నారు.