Telangana Bonalu : మళ్లీ డప్పులు, బ్యాండు మేళాలు..మాస్క్ ఉంటేనే బోనాలకు అనుమతి

Telangana Bonalu : మళ్లీ డప్పులు, బ్యాండు మేళాలు..మాస్క్ ఉంటేనే బోనాలకు అనుమతి

Bonalu]

Telangana Bonalu : గోల్కొండలో బోనాల సందడి నెలకొంది. జగదాంబికా అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. గోల్కొండ బోనాలతో హైదరాబాద్‌లో ఉత్సవాలు మొదలై… 9 వారాల పాటు జరుగనున్నాయి. రాబోయే వారం లష్కర్‌ ప్రజలు బోనాల పండుగను జరుపుకుంటారు. ఆ తర్వాత లాల్‌ దర్వాజా, ధూళ్‌పేట, బల్కంపేట, పాతబస్తీ అమ్మవారి ఆలయాల్లో బోనాల పండుగ జరుపుకుంటారు. నగరాల్లో ముగిసిన తర్వాత జిల్లాల్లోనూ ఈ బోనాల పండుగను జరుపుకుంటారు తెలంగాణ ప్రజలు. తెలంగాణలో బోనాలు ఉత్సవాలు గోల్కొండ కోటలో ప్రారంభమై.. చివరకు ఇక్కడే ముగుస్తాయి.

Read More : Twitter India Grievance Officer : దిగొచ్చిన ట్విట్టర్..భారత్ లో గ్రీవెన్స్ అధికారిగా వినయ్ ప్రకాశ్ నియామకం

గతేడాది కరోనా కారణంగా ఊరేగింపు, డప్పు వాయిద్యాలు, బ్యాండు మేళాలు, పోతురాజుల నృత్యాలు లేకుండా బోనాల పండగ ఉత్సవాలను నిర్వహించారు. కానీ ఈసారి కరోనా ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడంతో మళ్లీ డప్పు వాయిద్యాలు, బ్యాండు మేళాలు, పోతురాజుల నృత్యాల మధ్య బోనాల పండుగ జరుగుతోంది. అయినా ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం తప్పనిసరి. మాస్క్‌ ఉంటేనే బోనాలకు అనుమతిస్తామని పోలీసులు తేల్చి చెబుతున్నారు. గోల్కొండ బోనాలకు దాదాపు 500 మందితో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. మహిళల భద్రతకు షీ టీమ్స్‌ కూడా పనిచేయనున్నాయి. బోనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ కరోనా సేఫ్టీ ప్రికాషన్స్‌ పాటించాలని.. విధిగా అందరూ మాస్క్‌ ధరించాలని, సోషల్‌ డిస్టెన్ష్‌ పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. మాస్క్‌ లేనివారికి గోల్కొండలోకి ఎంట్రీ ఉండబోదన్నారు.

Read More : Rajinikanth Political Entry : రాజకీయాల్లోకి తలైవా ? అభిమానులతో మీటింగ్

గోల్కొండ కోటలో జరిగే బోనాల సందర్భంగా పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. రాత్రి 8 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. రామ్ దేవ్ గూడ, మక్కాయి దర్వాజా, లంగర్ హౌస్, సెవెన్ టూంబ్స్ ప్రాంతాల నుంచి కోటకు వచ్చే వారు ట్రాఫిక్‌ సూచనలు పాటించాలని పోలీసులు కోరారు. రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలన్నారు. బోనాల జాతరకు వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించారు పోలీసులు.