Etela Rajender Vs Communist Leaders : ఈటల వ్యాఖ్యలపై కామ్రేడ్ల గరం గరం

హరీష్‌రావు సైతం టీఆర్‌ఎస్‌లో అవమానాలు ఎదుర్కొన్నారని ఆరోపించిన ఈటల.. మరికొన్ని పార్టీల నేతలను టార్గెట్‌ చేశారు. సీపీఐ, సీపీఎం రాష్ట్ర అగ్రనేతలపై ఈటల మొన్న చేసిన వ్యాఖ్యలతో కలకలం చెలరేగింది. దీంతో కామ్రేడ్ లీడర్లు రంగంలోకి దిగారు. ఈటల వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించారు.

Etela Rajender Vs Communist Leaders : ఈటల వ్యాఖ్యలపై కామ్రేడ్ల గరం గరం

Tg

Telangana Etela Rajender : హరీష్‌రావు సైతం టీఆర్‌ఎస్‌లో అవమానాలు ఎదుర్కొన్నారని ఆరోపించిన ఈటల.. మరికొన్ని పార్టీల నేతలను టార్గెట్‌ చేశారు. సీపీఐ, సీపీఎం రాష్ట్ర అగ్రనేతలపై ఈటల మొన్న చేసిన వ్యాఖ్యలతో కలకలం చెలరేగింది. దీంతో కామ్రేడ్ లీడర్లు రంగంలోకి దిగారు. ఈటల వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించారు.

సీపీఐపై ఆరోపణలు చేయడమంటే సూర్యునిపై ఉమ్మి వేయడమేనన్నారు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. సీపీఐ…ఎన్నికల్లో పోటీచేయాలా లేదా అనేది ఎవరు నిర్ణయిస్తారో తెలుసుకోవాలని హితవు పలికారాయన. సీపీఐ జాతీయ పార్టీ అని, వ్యక్తుల ప్రమేయాలకు అనుగుణంగా తమ పార్టీ నడవదన్నారు చాడ వెంకటరెడ్డి. వామపక్ష భావజాలం కల్గిన వ్యక్తినని చెప్పుకునే ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరాలనుకోవడం సిగ్గుచేటన్నారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.

ఈటల తన ఆస్తులను కాపాడుకునేందుకే బీజేపీలో చేరుతున్నారని ఆరోపించారు. కమ్యునిస్ట్ పార్టీలపై నిందలు, విమర్శలు చేయడం సరికాదన్నారు తమ్మినేని వీరభద్రం. టీఎస్ఆర్టీసీ గురించి, కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడే అర్హత ఈటలకు లేదన్నారు టీఎంయూ నేత థామస్‌రెడ్డి. కవితపై కామెంట్స్‌ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ …ఆర్టీసీని నిర్వీర్యం చేయాలనుకుంటే..నష్టాల్లో ఉన్న సంస్థను అమ్మివేయడం ఎంతసేపని ప్రశ్నించారు థామస్‌రెడ్డి.

Read More : Immunity: కరోనా థర్డ్ వేవ్‌లో ప్రమాదం పిల్లలకే.. వారికోసం ఏం చెయ్యాలంటే?