దుబ్బాక ఎన్నికల్లో బీజేపీకి ఊహించని విజయం దక్కేలా ఉంది.. : రామ్ మాధవ్

  • Published By: nagamani ,Published On : November 10, 2020 / 11:01 AM IST
దుబ్బాక ఎన్నికల్లో బీజేపీకి ఊహించని విజయం దక్కేలా ఉంది.. : రామ్ మాధవ్

Telangana Dubaka by-election BJP leading : దుబ్బాక ఉప ఎన్నికలో ఊహించని పరిణామం జరుగుతోంది. ఊహించని విధంగా ఓట్లు దక్కించుకోవటంలో బీజేపీ ముందుంది. దుబ్బాక ఎన్నికల్లో ముఖ్యంగా స్థానికంగా అధికారంలో ఉన్న పార్టీ అయిన టీఆర్‌ఎస్‌, జాతీయ పార్టీ అయిన బీజేపీ మధ్యే పోరు రసవత్తరంగా కొనసాగుతోంది. నాలుగో రౌండ్‌లో కూడా టీఆర్ఎస్‌పై బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. ఈ విజయంపై స్థానిక బీజేపీ నేతలకాకుండా జాతీయ కమల నేతలు కూడా ఆనందం వ్యక్తంచేస్తున్నారు.



దుబ్బాకలో బీజేపీ ముందంజలో కొనసాగుతుండటంపై జాతీయ బీజేపీ నేత..పార్టీ సీనియర్ నేత అయిన రామ్ మాధవ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..దుబ్బాకలో బీజేపీకి ఊహించని విజయం దక్కేలా ఉందని హర్షం వ్యక్తంచేశారు.



దుబ్బాకకు జరిగిన ఉప ఎన్నికల్లో తొలి మూడు రౌండ్లలోనూ బీజేపీ నేత రఘునందన్ రావుకు ఆధిక్యం రావడంపై రామ్ మాధవ్ ఆనందం వ్యక్తంచేశారు. ‘‘తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఆసక్తికర పోరుకు దుబ్బాక ఉప ఎన్నిక వేదికైంది. బీజేపీ ప్రస్తుతం లీడింగ్ లో ఉంది. అనుకోని విజయం బీజేపీకి దక్కేలా ఉంది” అని ఆయన ఆనందంగా ట్వీట్ చేశారు.



https://10tv.in/dubbaka-bypoll-result-live-updates/
కాగా, ప్రస్తుతం మూడు రౌండ్లు ముగిసేసరికి రఘునందన్ రావు 1,250కి పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని సోలిపేట సుజాతకు 7,964 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 9,223 ఓట్లు లభించాయి. మూడవ రౌండ్ లో రఘునందన్ రావుకు 129 ఓట్ల ఆధిక్యం లభించింది.