Women’s Day: ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. మహిళా దినోత్సవాన్ని సాధారణ సెలవు దినంగా పరిగణిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బుధవారం, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనే సంగతి తెలిసిందే. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం మహిళలకు వడ్డీలేని రుణాలు అందజేయనుంది.

Women’s Day: ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు

Women’s Day: మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు బుధవారం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. మహిళా దినోత్సవాన్ని సాధారణ సెలవు దినంగా పరిగణిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Andhra Pradesh: కొత్తపల్లి మండలంలో కనిపించిన పెద్దపులి పిల్లలు.. జాడ లేని తల్లి పులి.. ఆందోళనలో గ్రామస్తులు

బుధవారం, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనే సంగతి తెలిసిందే. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం మహిళలకు వడ్డీలేని రుణాలు అందజేయనుంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని సెర్ప్, మెప్మా మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఈ నెల 8న రూ.750 కోట్ల నిధుల్ని విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మహిళల ఖాతాల్లో ఇవి జమ అవుతాయన్నారు. సంగారెడ్డి జిల్లాలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు.

Shashi Tharoor: అందం, తెలివి గురించి యువతి అడిగిన ప్రశ్నకి శశి థరూర్ ఎపిక్ రిప్లై.. వైరల్ అవుతున్న వీడియో

ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య మహిళా కార్యక్రమం తీసుకురాబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. దీని ద్వారా ప్రతి మంగళవారం మహిళలనకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, అవసరమైన మందులు అందజేస్తామని హరీష్ రావు చెప్పారు. మహిళల కోసం 100 ప్రత్యేక ఆస్పత్రుల్ని ప్రారంభిస్తామని అన్నారు. తెలంగాణలోని ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీలు పెరిగాయని గుర్తు చేశారు.