Telangana Budget : బడ్జెట్‌పై వీడని ఉత్కంఠ.. ఇంకా ఆమోదం తెలపని గవర్నర్, హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం

బడ్జెట్ ఆమోదం కోసం హైకోర్టు మెట్లు ఎక్కనుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ బడ్జెట్ కు గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదు. దీంతో గవర్నర్ తీరును సవాల్ చేస్తూ రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.(Telangana Budget)

Telangana Budget : బడ్జెట్‌పై వీడని ఉత్కంఠ.. ఇంకా ఆమోదం తెలపని గవర్నర్, హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం

Telangana Budget : బడ్జెట్ ఆమోదం కోసం హైకోర్టు మెట్లు ఎక్కనుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ బడ్జెట్ కు గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదు. దీంతో గవర్నర్ తీరును సవాల్ చేస్తూ రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ దుశ్యంత్ దవే వాదనలు వినిపించనున్నారు.

తెలంగాణలో గవర్నర్, ప్రభుత్వం మధ్య జరుగుతున్న వివాదం పీక్ స్టేజ్ కి చేరింది. ఇప్పటికే గవర్నర్ ఆమోదం కోసం తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనలను రాజ్ భవన్ కు పంపించారు. కానీ, ఇప్పటివరకు గవర్నర్ ఆమోదం తెలపలేదు. రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించడం, ఆ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం, హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించడం, గవర్నర్ తన ప్రసంగంలోనూ తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేశారు.(Telangana Budget)

Also Read..Telangana Politics : మీరు పార్లమెంట్ రద్దు చేయండీ..మేం అసెంబ్లీ రద్దు చేస్తాం రండీ తేల్చుకుందాం : బీజేపీకి కేటీఆర్ సవాల్

ఫామ్ హౌస్ కట్టడం, బిల్డింగ్ లు కట్టడం అభివృద్ధి కాదంటూ గవర్నర్ మాట్లాడారు. తెలంగాణలో రోజుకు 22 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని గవర్నర్ ప్రసంగించారు. దీంతో గవర్నర్ ప్రసంగం పై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు.

Also Read..Telangana Politics : పాలమూరు పార్లమెంట్‌ సీటుపై ఆల్ పార్టీస్ ఫోకస్‌.. పాలమూరు బరిలో ప్రధాని మోడీ ఉంటారనే ప్రచారంలో నిజమెంత?

ఫిబ్రవరి 3న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజున అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. బడ్జెట్ కు సంబంధించి చర్చించారు. ఇప్పటికే బడ్జెట్ ప్రతిపాదనలు రాజ్ భవన్ కు పంపినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటివరకు గవర్నర్ ఆమోదం తెలపలేదు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టే ముందు గవర్నర్ ఆమోదం అవసరం అవుతుంది. బడ్జెట్ పై చర్చించిన తర్వాత ఆమోదించి బడ్జెట్ కి కూడా మళ్లీ గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇలా రెండు దశల్లో గవర్నర్ ఆమోదం బడ్జెట్ కు అవసరం. ముఖ్యంగా ఆర్థిక బిల్లులు అన్నింటికి గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది.

అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో బడ్జెట్ ప్రతిపాదనలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపకపోయే చాన్స్ ఉందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో న్యాయ పోరాటానికి సర్కార్ సిద్ధమైంది. ప్రభుత్వం రేపు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ అడ్వకేట్ దుశ్యంత్ దవే రేపు ఈ పిటిషన్ పై వాదనలు వినిపించనున్నారు.

ఫిబ్రవరి 3వ తేదీన ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అంటే 2వ తేదీన బడ్జెట్ ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం తెలిపినా సరిపోతుంది. అప్పటివరకు ఆమోదం తెలిపేందుకు గవ్నరర్ కు అవకాశం ఉంది. అయితే, గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం లేదనే ఒక అనుమానంతో ప్రభుత్వం ఉంది. అందుకే దీనిపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయబోతోంది సర్కార్. బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు గవర్నర్ ఇంకా సమయం ఉంది. అయితే, గర్నవర్ ఆమోదం తెలపకపోవచ్చన్న అనుమానంతో కోర్టుని ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.