Group 1 Prelims Exams : గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల వాయిదా పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Group 1 Prelims Exams : ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

Group 1 Prelims Exams : గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల వాయిదా పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Group 1 Prelims Exams

Telangana High Court : గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికిప్పుడు పరీక్షలు వాయిదా వేయలేము అని కోర్టు స్పష్టం చేసింది. 2 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలను వాయిదా వేయలేము అని వ్యాఖ్యానించింది.

అనంతరం ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. కాగా, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు 2 నెలల పాటు వాయిదా వేయాలని గ్రూప్ 1 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న 36మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు.

Also Read..Konda Vishweshwar Reddy : ఫేక్ ఓట్లను నిర్మూలించడంలో ఈసీ విఫలం.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్

జూన్ 11న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఇంతలో, ఆ పరీక్షను వాయిదా వేయాలని 36మంది అభ్యర్థులు కోర్టుని ఆశ్రయించారు. ప్రిలిమ్స్ పరీక్షను రెండు నెలల పాటు వాయిదా వేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది.

జూన్ 11న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని ఇప్పటికే టీఎస్ పీఎస్ సీ నిర్ణయించింది. అయితే, ఈ పరీక్షను దాదాపు 2 నెలల పాటు వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు కోరారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు వాయిదా వేసేందుకు కోర్టు నో చెప్పింది.