Telangana : భూముల విలువ పెంపుకు కసరత్తు పూర్తి!

తెలంగాణలో ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ పెంచేందుకు కసరత్తు పూర్తైంది. దీనికి సంబందించిన ఫైల్ సీఎం కేసీఆర్ వద్దకు చేరింది. సీఎం అంగీకరిస్తే ఆగస్టు 1 తేదీ నుంచి నూతన ధరలు అమల్లోకి రానున్నాయి.

Telangana : భూముల విలువ పెంపుకు కసరత్తు పూర్తి!

Telangana (3)

Telangana : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ (కార్డ్ వ్యాల్యూ) పెంపునకు రంగం సిద్ధమైంది. ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ పెంపుకు సంబందించిన కసరత్తు ఇప్పటికే పురటినట్లు అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఫ్లాట్లు, ఇళ్లు, ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూముల కేటగిరీల్లో 30 శాతం నుంచి 400 శాతం వరకు పెరగనున్నట్లు సమాచారం. కాగా ప్రతి రెండేళ్లకు ఒకసారి రిజిస్ట్రేషన్ విలువను సమీక్షించి రేట్లు పెంచాలని ప్రభుత్వంలో ఉంది.

కానీ ప్రభుత్వాలు దీని జోలికి వెళ్ళలేదు. ఇక ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేట్లు పెంచేందుకు సిద్ధమైంది. రిజిస్ట్రేషన్ రేట్లు పెంచడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఏడాది రూ.3,400 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పెంపుకు సంబందించిన ప్రతిపాదనలు సీఎం కేసీఆర్ వద్దకు చేరాయని, ఆయన ఒకే చెబితే ఈ ఏడాది ఆగష్టు 1 నుంచే అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు చెప్తున్నాయి.

ఇక రిజిస్ట్రేషన్ విలువల సవరణ ప్రక్రియ శాస్త్రీయ పద్దతిలో నిర్దారించే దిశలో కసరత్తు చేస్తుంది ప్రభుత్వం. 2019–20 ఆర్థిక సంవత్సరంలో జరిగిన రిజిస్ట్రేషన్‌ లావాదేవీల సగటును తీసుకుని లెక్కలు కట్టారు.ప్రధానంగా జాతీయ, రాష్ట్ర, అంతర్‌ జిల్లా రహదారులు, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాలను బట్టి విలువలను నిర్ధారించినట్టు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇక 2019–20 లెక్కల ప్రకారం ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.6,299 కోట్లు ఆదాయం వచ్చింది. కొత్తగా నిర్దారించిన ధరలు అమలులోకి వస్తే రూ.9,600 కోట్ల వరకు చేరవచ్చని అంచనా. రిజిస్ట్రేటిన్లు పెరిగే కొద్దీ ఆదాయం పెరగనుంది.