TRS MLAs trap issue : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం .. ఆడియో, వీడియో టేపులను బయటపెట్టనున్న పోలీసులు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఈరోజు ఆడియో, వీడియో టేపులను బయటపెట్టనున్నారు.

TRS MLAs trap issue :  టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం .. ఆడియో, వీడియో టేపులను బయటపెట్టనున్న పోలీసులు

TRS MLAs trap issue

TRS MLAs trap issue : మునుగోడు ఉప ఎన్నిక జరుగనున్న క్రమంలో తెలంగాణలో ఎవ్వరూ ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. గత కొంతకాలంలో టీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరతారు అంటూ ధీమా చెబున్నారు కమలం నేతలు. ఈక్రమంలో తెలంగాణలో అనూహ్యంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు హాట్‌ టాపిక్‌గా మారాయి. బుధవారం (అక్టోబర్ 26,2022)రాత్రి మొదలైన హైడ్రామా.. అందరినీ ఆశ్చర్యపరిచింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేయానికి భారీ స్కెచ్ వేసిన క్రమంలో అందంతా బట్టబయలు అయ్యింది. ఈ పరిణామంపై అధికార పక్షమైన టీఆర్‌ఎస్‌ నేతల మాటలు ఒకలా ఉంటే..మరోవైపు బీజేపీ నేతల మాటలు మరోలా ఉన్నాయి. బీజేపీయే మా పార్టీ ఎమ్మెల్యేలను కొనటానికి కుట్ర చేసిందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కానీ బీజేపీ మాత్రం వారే కుట్ర చేసి వారే డ్రామాలాడుతున్నారంటోంది. ఇలా ఒకరిపై మరొకరు చేసుకునే వ్యాఖ్యలు…ఆరోపణలు ఆసక్తికరంగా మారాయి..

Operation Akarsh: ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనేనా.. ‘ఆపరేషన్ ఆకర్ష్’ గుట్టు ఎలా రట్టైంది?

ఈ క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కుట్ర ఎవరిది? దీని వెనుక ఎవరున్నారు? కుట్రదారులు ఇంకా ఎవరెవరిని సంప్రదించారు? వంటి పలు అంశాలు తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు నిందితులు స్వామీజీ, నందు, సతీశ్ లపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 8..సెక్షన్ 120బి కింద కేసు నమోదు చేసారు మొయినాబాద్ పోలీసులు. దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మాత్రం నందకుమార్ అనే వ్యక్తి కీరోల్ ప్లే చేసినట్లుగా తెలుస్తోంది. పలువురు రాజకీయ నేతలతో మాట్లాడినప్పుడు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు పేర్కొంటున్న నందకుమార్‌ అలియాస్‌ నందు వైపే దృష్టి అంతా ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే నందుకు బీజేపీ నేతలతో పాటు టీఆర్‌ఎస్‌ నేతలతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్లుగా పలు ఫోటోలు బయటపడటంతో నందు పాత్ర చాలా కీలకంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. డీల్ చేసుకోవటానికి తన ఫాంహౌజ్ కు వచ్చారని..నందు, స్వామీజీ,సతీశ్ కలిసి బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చారని..టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకొస్తే రూ.50 కోట్లు ఇస్తామని చెప్పారని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ముగ్గురిపై కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

TRS MLAs Trap Issue : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ.100 కోట్ల డీల్? దీని వెనుకున్నది వారేనా?

హై ప్రొఫైల్‌ వ్యక్తులతో తిరిగే అలవాటున్న నందుకు డీల్‌ ఏదైనా సరే.. దాన్ని పూర్తి చేసే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాడని అతని సన్నిహితులు చెబుతుంటారు. కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత కిషన్‌ రెడ్డికి సన్నిహితుడిగా నందు ఉన్నాడనే వార్తలు వస్తున్న క్రమంలో నందుకు టీఆర్‌ఎస్‌ నేతలతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. తాజాగా ప్రలోభానికి గురైన నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో ఒకరు నందుతో అత్యంత సన్నిహితంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. వాస్తవానికి ఫాంహౌ్‌సకు నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో పాటు అధికార పార్టీకి చెందిన మరో ఎంపీ కూడా హాజరు కావాల్సి ఉందట..ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన సదరు ఎంపీ కూడా ఈ మీటింగ్‌కు రావాల్సి ఉన్నప్పటికీ.. ఆఖరి నిమిషంలో కుదరక రాలేదన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు.. మరో ఇద్దరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా ఈ భేటీకి హాజరు కావాల్సి ఉందట. అనివార్య కారణాల వల్ల రాలేదని తెలుస్తోంది. నందుకు హైదరాబాద్‌ శివారుకు చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కుమారులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు.నందుకు సన్నిహితంగా ఉంటే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఒకరి చొరవతో ఈ మీటింగ్‌ మొదలైనట్లు తెలుస్తోంది. దీనికి కాస్త ముందుగా తాము భేటీ కానున్న సమాచారాన్ని సొంత పార్టీకి చెందిన కీలక నేతతో షేర్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ స్కెచ్‌ ఎవరిది? అన్న ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది.ఈరోజు పోలీసులు ఈ వ్యవహారినికి సంబంధించి వీడియో,ఆడియో టేపులను బయటపెట్టనున్నారు.

Kishan Reddy : ఇది కేసీఆర్ కుట్రే..! మునుగోడులో ఓటమి భయంతోనే ఈ డ్రామా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ ఎదురుదాడి

పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాలపై రాజకీయ వర్గాల్లో భిన్నమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉదంతంపై టీఆర్‌ఎస్ కు చెందిన ఒక ముఖ్యమైన నేత ‘ఒక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చొరవతో ఈ మీటింగ్‌ మొదలైంది. విచిత్రంగా సదరు ఎమ్మెల్యే ఆఖరి నిమిషంలో ప్లేట్‌ తిప్పేసి.. డబుల్‌ గేమ్‌ ఆడారు’ అని సదరు నేత అభిప్రాయపడ్డారు. ఈ విషయం పెను ఆసక్తికరంగా మారింది.ఒకవేళ ఈ వాదనే నిజమైన పక్షంలో చివరి నిమిషంలో డబుల్‌ గేమ్‌ ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? అనేది కూడా తేలాల్సి ఉంది.