Operation Akarsh: ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనేనా.. ‘ఆపరేషన్ ఆకర్ష్’ గుట్టు ఎలా రట్టైంది?

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంపై సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పందించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ఈ దాడి చేసినట్లు చెప్పారు.

Operation Akarsh: ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనేనా.. ‘ఆపరేషన్ ఆకర్ష్’ గుట్టు ఎలా రట్టైంది?

Operation Akarsh: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ‘ఆపరేషన్ ఆకర్ష్’ను పోలీసులు విఫలం చేసిన సంగతి తెలిసిందే. మొయినాబాద్ ఫాంహౌజ్‌లో బుధవారం సాయంత్రం నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

WhatsApp: వాట్సాప్ నిలిచిపోవడానికి కారణం ఇదే.. కంపెనీ ఏం చెప్పిందంటే

నలుగురు మధ్యవర్తుల నుంచి రూ.15 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో అక్కడ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాల్ని స్టీఫెన్ రవీంద్ర సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే సమాచారం అందించారు. తమకు కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని ప్రలోభపెడుతున్నట్లు చెప్పారు. రామచంద్ర భారతి ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారు. తిరుపతి నుంచి ఒక స్వామీజీ కూడా వచ్చారు. మధ్యవర్తుల్లో హైదరాబాద్‌లో ఉండే నంద కుమార్ కూడా ఉన్నాడు.

Telangana: ‘ఆపరేషన్ ఆకర్ష్’ గుట్టురట్టు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నం.. విఫలం చేసిన పోలీసులు

ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఫాంహౌజ్‌పై రైడ్ చేశారు. నిందితుల్ని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేలను ఏ రకమైన ప్రలోభాలకు గురి చేశారు అనే అంశంపై విచారణ జరుపుతామని స్టీఫెన్ రవీంద్ర చెప్పారు.