Telangana Corona Bulletin Updated : తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో మరోసారి కరోనా కలకలం రేగింది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది.(Telangana Corona Bulletin Updated)

Telangana Corona Bulletin Updated : తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

Telangana Covid Report

Telangana Corona Bulletin Updated : తెలంగాణలో మరోసారి కరోనా కలకలం రేగింది. రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి వ్యాప్తి మరోసారి పెరుగుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా రోజువారీ కేసుల సంఖ్య 150కి పైనే నమోదైంది. క్రితం రోజుతో(122) పోలిస్తే కొత్త కేసులు పెరిగాయి.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 16వేల 319 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 155 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్ లో అత్యధికంగా 81 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 42, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11, సంగారెడ్డి జిల్లాలో 8 కేసులు గుర్తించారు. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 59 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు.(Telangana Corona Bulletin Updated)

Covid Vaccine: జంతువులకు కూడా కొవిడ్ వ్యాక్సిన్.. ఇండియాలో తొలిసారి

తెలంగాణలో నేటివరకు 7లక్షల 94వేల 184 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7లక్షల 89వేల 166 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 907 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 12వేల 385 కరోనా పరీక్షలు చేయగా 122 కొత్త కేసులు వచ్చాయి.

Heart Disease: పురుషుల్లో గుండె జబ్బులకు ఇవే కారణమవుతున్నాయ్!

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఆందోళనకు గురి చేస్తోంది. వరుసగా రెండోరోజూ కొత్త కేసుల సంఖ్య 7 వేల మార్కు దాటింది. యాక్టివ్ కేసులు దాదాపు నాలుగు వేల మేర పెరిగి.. 36 వేలకు చేరాయి.

గురువారం 3.35 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 7వేల 584 మంది వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. క్రితం రోజుతో పోల్చితే 300 మేర కేసులు పెరిగాయి. పాజిటివిటీ రేటు 2.26 శాతానికి చేరి, ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మహారాష్ట్ర(2,813), కేరళ(2,193)లోనే ఐదు వేలకు పైగా కేసులొచ్చాయి. ఢిల్లీ(622)లో కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇలా పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్లు విస్తరిస్తుండటంతో కేంద్రం స్థానిక ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. టెస్టుల సంఖ్యను భారీగా పెంచాలని సూచించింది.(Telangana Corona Bulletin Updated)

cancer : వైద్య చరిత్రలోనే మరో అద్భుతం..‘టాబ్లెట్ తో క్యాన్సర్’ ఖతం

రోజురోజుకూ యాక్టివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ముందురోజు 32వేల 498గా ఉన్న కేసులు.. తాజాగా 36వేల 267(0.08శాతం)కు పెరిగాయి. ఒక్కరోజు వ్యవధిలో మరో 3వేల 791 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.70 శాతానికి తగ్గింది. 24 గంటల వ్యవధిలో మరో 24 మంది కరోనాతో మరణించారు. మొత్తంగా 5.24 లక్షల మందికిపైగా మహమ్మారికి బలయ్యారు. ఇక నిన్న 15.31 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 194 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.