Children’s tub : బిడ్డల్ని పారేసే తల్లులకు విజ్ఞప్తి..‘పిల్లల తొట్టి’లో వదలండి

అప్పుడే పుట్టిన పసిగుడ్డుల్ని పారేస్తున్న దారుణ పరిస్థితులు మానవత్వం చచ్చిపోయిందా అనిపిస్తున్నాయి. కానీ ఇకనుంచి బిడ్డల్ని వదిలేయాలనుకువారు ‘పిల్లల తొట్టి’లో వదలమని విజ్ఞప్తి చేస్తున్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు. బిడ్డల్ని చెత్త పారేసినట్లుగా పారేయవద్దని వారి కోసం ‘పిల్లల తొట్టి’లో వదలమని విజ్ఞప్తి చేస్తున్నారు.

Children’s tub : బిడ్డల్ని పారేసే తల్లులకు విజ్ఞప్తి..‘పిల్లల తొట్టి’లో వదలండి

Children's Tub

Children’s tub In govt Office : చెత్తకుప్పలో పసిబిడ్డ..ముళ్లపొదల్లో పసిగుడ్డు..అట్టపెట్టెలో ఎవరో వదిలేసి పోయిన పసిపాప,మురికి కాలువల్లో శిశువు మృతదేహం ఇటువంటి అత్యంత అమానుషమైన వార్తలు వింటున్నాం. చూస్తున్నాం. అవాంఛిత గర్భాల వల్లనో..లేక బిడ్డల్ని పెంచలేకో..పసిగుడ్డుల్ని ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా మురికి కాలువల్లోను..చెత్తకుప్పల్లోను, ముళ్లపొదల్లోను వదిలేస్తున్నారు. కారణం ఏదైనాగానీ ఇది అత్యంత అమానుషం.బిడ్డలు లేక ఎంతోమంది అల్లాడుతుంటే పుట్టిన బిడ్డల్ని పేగుపాశాన్ని తెంచుకుని కర్కశంగా వదిలేస్తున్న ఘటనలు ఎన్నో..ఎన్నెన్నో. ఇటువంటి తల్లులకు తెలంగాణ రాష్ట్ర శిశుసంక్షేమ శాఖ అధికారులు ఓ విజ్ఞప్తి చేస్తున్నారు. పలు కారణాలతో పసిబిడ్డల్ని వదిలేస్తున్న ఘటనలపై స్పందించిన అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

పసిపిల్లలను ఎక్కడో చెత్త కుప్పలో పడేస్తున్న వారిని చేరదీయాలనే ఆలోచన చేశారు. ముఖ్యంగా పిల్లలను ఎవరికైనా ఇవ్వాలంటే చట్టపరమైన అనేక అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది.. చట్టవ్యతిరేకంగా కూడా పిల్లలను కనేవారికి కూడా చట్టాలు అడ్డంకిగా మారుతాయి. దీంతో చట్టపరమైన ఎలాంటీ అడ్డంకులు లేకుండా సంగారెడ్డి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. పిల్లలను వదిలేయలని లేదా వదిలించుకోవాలనుకునేవారు బిడ్డల్ని చెత్తకుప్పల్లో కాకుండా తమకు అప్పగించాలని చెబుతున్నారు. ఇలా వారికి అప్పగించే ప్రక్రియలో ఎటువంటి నిబంధనలు.. అడ్డంకులు ఉండని తెలిపారు. దాని కోసం జిల్లా కార్యాలయంలో ‘పిల్లల తొట్టి’ని ఏర్పాటు చేశారు.

పిల్లలకు వదిలివేయటానికి వచ్చిన వారి గురించి బయటకు తెలియకుండా ‘పిల్లల తొట్టి’ని ఏర్పాటు చేసిన ప్రాంతంలో సిసి కెమేరాలు లేకుండా కూడా జాగ్రత్త పడ్డారు. ఈ తొట్టిలో పిల్లలను వదిలివేసే పిల్లల సంరక్షణ తాము చూసుకుంటామని చెబుతున్నారు.దీని వలన ఎవ్వరికి ఎటువంటి అభ్యంతరం ఉండదని హమీ ఇస్తున్నారు.

ఇక ఈ ఐడియా మంచి ఫలితాలను ఇస్తే పారేసే బిడ్డలు బతికి బట్టకట్టినట్లే. అంతేకాకుండా ఈ ఐడియా మంచి ఫలితాలను ఇస్తే జిల్లాలోని అన్ని ఏరియా ఆసుపత్రుల్లో పిల్లల తొట్టిలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.