తెలంగాణలో తొలి కాంటాక్ట్ కేసు…హైదరాబాద్ యువకుడికి కరోనా 

తెలంగాణలో తొలి కాంటాక్ట్ కేసు నమోదు అయింది. హైదరాబాద్ కు చెందిన 35 ఏళ్ల యువకుడికి కరోనా వైరస్ సోకింది.

  • Published By: veegamteam ,Published On : March 21, 2020 / 12:34 PM IST
తెలంగాణలో తొలి కాంటాక్ట్ కేసు…హైదరాబాద్ యువకుడికి కరోనా 

తెలంగాణలో తొలి కాంటాక్ట్ కేసు నమోదు అయింది. హైదరాబాద్ కు చెందిన 35 ఏళ్ల యువకుడికి కరోనా వైరస్ సోకింది.

తెలంగాణలో తొలి కాంటాక్ట్ కేసు నమోదు అయింది. హైదరాబాద్ కు చెందిన 35 ఏళ్ల యువకుడికి కరోనా వైరస్ సోకింది. రాష్ట్రంలో కొత్తగా మరో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కు చేరింది.

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా లండన్‌ నుంచి వచ్చిన 18 ఏళ్ల హైదరాబాద్‌ యువతి కరోనా బారిన పడింది. ప్రస్తుతం బాధితురాలు చెస్ట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇక ఇటీవల కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియా బృందంలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇండోనేషియా బాధితుల్లో 27 ఏళ్ల యువకుడు, 60ఏళ్ల వ్యక్తి ఉన్నారు. ప్రస్తుతం వీరిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

మొదటి కేసు యువకుడు ఇప్పటికే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. మిగిలిన 20 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఉన్న కరోనా బాధితుల్లో 11 మంది విదేశీయులు ఉన్నారు. మిగిలిన 8 మంది భారతీయులు. వారు కూడా విదేశాలకు వెళ్లి వచ్చిన వారే. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం అన్నివిధాలా చర్యలు చేపట్టిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ప్రజలు కూడా సమాయత్తం కావాలని సూచించారు.

కరోనాను ఆషామాషీగా తీసుకుంటే భారీ మూల్యం తప్పదని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. అలాగని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలను బయటకు రానీయవద్దని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సోషల్ డిస్టెన్స్, వ్యక్తిగత శుభ్రత పాటిస్తే ఈ వ్యాధి రాకుండా నివారించవచ్చని సూచించింది.