Telangana : ధరణి పోర్టల్‌కు ఏడాది పూర్తి..10 లక్షలకు పైగా లావాదేవీలు

ధరణి పోర్టల్‌కు ఏడాది పూర్తైంది. ఈ ఒక్క సంవత్సరంలోనే 10 లక్షలకు పైగా లావాదేవీలు పూర్తయ్యాయి. ధరణి పోర్టల్ విజయవంతం అవడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

Telangana : ధరణి పోర్టల్‌కు ఏడాది పూర్తి..10 లక్షలకు పైగా లావాదేవీలు

Dharani (2)

Dharani portal in telangana : ధరణి పోర్టల్‌కు ఏడాది పూర్తైంది. ఈ ఒక్క సంవత్సరంలోనే 10 లక్షలకు పైగా లావాదేవీలు పూర్తయ్యాయి. ధరణి పోర్టల్ విజయవంతం అవడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ధరణి సక్సెస్‌కు కారణమైన.. అధికారులు, ఉద్యోగులను సీఎస్ సోమేశ్ కుమార్ అభినందించారు. ఏడాదిలోనే ధరణి పోర్టల్‌కు 5 కోట్ల 17 లక్షల హిట్స్ వచ్చాయి. గతేడాది అక్టోబర్ 29వ తేదీన ఈ ధరణి పోర్టల్‌ను ప్రారంభించగా తొలి ఏడాది తన కార్యకలాపాలను విజయవంతంగా పూర్తి చేసింది.

రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని సేవలు అందించేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం.. ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. భూ సంబంధిత లావాదేవీలకు ధరణి వన్-స్టాప్ పరిష్కారాన్ని అందిస్తోంది. ఈ పోర్టల్‌ అందుబాటులోకి రావడంతో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రజల ఇంటి ముంగిటకే చేరాయి. గతంలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగ్గా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 574 తహసీల్దార్‌ కార్యాలయాల్లో జరుగుతున్నాయి.

Chennai NGT : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు బ్రేక్

భూపరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. మొదటి సంవత్సరంలోనే ధరణి అనుకున్నదానికంటే ఎక్కువ ప్రగతి సాధించింది. తొలి ఏడాది ధరణి పోర్టల్‌ 5 కోట్ల పదిహేడు లక్షల హిట్లను సాధించగా.. దాదాపు పది లక్షలకు పైగా లావాదేవీలు జరిగాయి. కొత్తగా లక్షా 80 వేల ఎకరాలకు ధరణి పరిధిలోకి తీసుకువచ్చి పాస్‌పుస్తకాలు జారీ చేశారు. నిత్యం పెరుగుతున్న మార్పులు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుకునేలా.. ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

ఎప్పటికప్పుడు స్టేక్ హోల్డర్ల నుంచి సలహాలు, సూచనలకనుగుణంగా సరికొత్త లావాదేవీల మాడ్యూల్స్‌ను జోడిస్తూ వస్తోంది. వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రత్యేక మాడ్యూల్స్‌ను పొందుపరిచారు. ప్రస్తుతం ధరిలో పోర్టల్‌లో 31 లావాదేవీల మాడ్యూల్స్‌, పది ఇన్ఫర్మేషన్‌ మాడ్యూల్‌ ఉన్నాయి.