Revanth Reddy : బండి సంజయ్, అర్వింద్ తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారు ? రేవంత్

బండి సంజయ్, అర్వింద్ తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ ప్రియార్టీలో తెలంగాణ లేదు, ఇక్కడి నేతలు లేరని పేర్కొన్నారు. కిషన్ రెడ్డికి బాత్ రూమ్ లు కడిగే శాఖ ఇచ్చారని తెలిపారు.

Revanth Reddy : బండి సంజయ్, అర్వింద్ తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారు ? రేవంత్

revanth

chief Revanth Reddy : బండి సంజయ్, అర్వింద్ తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ ప్రియార్టీలో తెలంగాణ లేదు, ఇక్కడి నేతలు లేరని పేర్కొన్నారు. కిషన్ రెడ్డికి బాత్ రూమ్ లు కడిగే శాఖ ఇచ్చారని తెలిపారు. చిట్ చాట్ లో రేవంత్ మాట్లాడుతూ పెద్ద రెడ్లు కేసీఆర్ కు అమ్ముడు పోయారు కాబట్టే కొత్త తరానికి అవకాశం వచ్చిందన్నారు. కేసీఆర్ అవినీతిలో బీజేపీ చెస్తోన్న ఆరోపణలు 1 శాతం మాత్రమేనని చెప్పారు.బీఆర్ఎస్ పార్టీకి రూ.1000 కోట్ల నిధులు వచ్చాయని, అవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పడం లేదన్నారు.

రూ.100 కోట్ల కోసం రాద్దాంతం చేస్తున్న బీజేపీ నేతలు రూ.1000 కోట్ల నిధులపై ఎందుకు స్పందించరని ప్రశ్నించారు.  బీజేపీ, బీఆర్ఎస్ ది వీధి నాటకం అన్నారు. ఓట్ల కోసం పాము ముంగిస ఆట ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ తరహా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఫామ్ హౌజ్ పై డ్రోన్ ఎగురవేశానని దేశ ద్రోహులను పెట్టిన జైలులో తనను వేశారని తెలిపారు. కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో సరైనవి కావని అభిప్రాయపడ్డారు.

Revanth Reddy : ఒక్కొక్కరికి రూ.5లక్షలు ఇస్తాం, ఒక్క ఛాన్స్ ప్లీజ్-రేవంత్ రెడ్డి

సీట్ల వారిగా సర్వే చేయడం లేదని.. ప్రజల మూడ్ పై సర్వే జరుగుతుందన్నారు. కేసీఆర్ ను సీరియస్ గా తీసుకోవడం మానేశామని చెప్పారు. సీఎంను ఆ పార్టీ నేతలు కూడా సీరియస్ తీసుకోవడం మానేశారని పేర్కొన్నారు. దేశంలో కాంగ్రెస్ కు 150 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. బీజేపీ బలంగా లేదని, భ్రమ మాత్రమేనని స్పష్టం చేశారు. డి.ఎస్ చేరిక అధిష్ఠానం పరిధిలో ఉందన్నారు. ఇప్పటికే రెండు సార్లు సోనియాను కలిశారని గుర్తు చేశారు.

పార్టీలో కొత్త చేరికలు త్వరలో ఉంటాయని తెలిపారు. నాయకులు అభ్యంతరం పెట్టినా చేరికలు అపొద్దు అని రాహుల్ గాంధీ చెప్పారని పేర్కొన్నారు. పార్టీ మేలు జరిగే అవకాశం ఉంటే కచ్చితంగా చేర్చుకుంటామని వెల్లడించారు. ఉత్తర తెలంగాణపై ఫోకస్ పెట్టామని తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ముందుగానే ప్రకటిస్తామన్నారు. బట్టి విక్రమార్క యాత్ర ఏఐసీసీ కార్యక్రమని.. తాను హాజరవుతానని చెప్పారు.