Telangana Politics: ప్రభుత్వం ఆ పని చేసుంటే సీతక్క కన్నీళ్లు పెట్టుకునేది కాదు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి ఒక సవాలు విసిరారు. తెలంగాణను నిజంగానే బంగారు తెలంగాణ చేసుంటే సిట్టింగులందరికీ సీట్లివ్వాలని, అలాగే కేసీఆర్ ఆయన నియోజకవర్గం గజ్వేల్ నుంచి పోటీ చేయాలని అన్నారు.

Telangana Politics: ప్రభుత్వం ఆ పని చేసుంటే సీతక్క కన్నీళ్లు పెట్టుకునేది కాదు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

TPCC Chief Revanth Reddy: వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుని ఉంటే సీతక్కలాంటి ఎమ్మెల్యేలు కన్నీళ్లు పెట్టుకునేవారు కాదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అంతే కాకుండా వరదబాధిత ప్రాంతాల్లో తిరగాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రౌడీల్లా వీధుల్లో తిరుగుతున్నారంటూ ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక ఈ విషయమై అసెంబ్లీలో తమ పార్టీ నేత శ్రీధర్ బాబు ప్రశ్నిస్తుంటే మంత్రులు అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార బీఆర్ఎస్ మీద నిప్పులు చెరిగారు.

Badvel : బద్వేల్ లో విద్యుత్ ఉద్యోగులు నిరసన.. విద్యుత్ లేక అలుముకున్న చీకట్లు, ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర అవస్థలు

‘‘వరద బాధితులకు నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఎవరైనా అడ్డుకున్నారా? రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయిందా? మున్సిపల్ మంత్రి వరదల్లో కొట్టుకుపోయారా?’’ అంటూ ప్రభుత్వంపై ప్రశ్న వర్షం కురిపించారు రేవంత్ రెడ్డి. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంది. హైదరాబాద్ చుట్టుపక్కల కేసీఆర్ కుటుంబం 10వేల ఎకరాలు కబ్జా చేశారు.. లక్ష కోట్లు వెనకేసుకున్నారు. కేసీఆర్ కు తెలంగాణతో రుణం తీరిపోయింది.. ఆయనకు తెలంగాణకు మోజు తీరింది. అందుకే వరద ప్రాంతాల్లో పర్యటించకుండా మహారాష్ట్ర కు వెళ్ళారు. మన క్షేమం పట్టని కేసీఆర్ మనకు అవసరమా?’’ అని అన్నారు.

Maharashtra Politics: ఏక్‭నాథ్ షిండేను రూ.50 కోట్లు ఇవ్వమంటూ అసెంబ్లీలో నిలదీసిన ఉద్ధవ్ థాకరే.. షిండే స్పందన ఏంటంటే?

ఇక ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి ఒక సవాలు విసిరారు. తెలంగాణను నిజంగానే బంగారు తెలంగాణ చేసుంటే సిట్టింగులందరికీ సీట్లివ్వాలని, అలాగే కేసీఆర్ ఆయన నియోజకవర్గం గజ్వేల్ నుంచి పోటీ చేయాలని అన్నారు. రాక్షసులందరినీ పుట్టించిన బ్రహ్మరాక్షసుడు కేసీఆరేనని బ్రహ్మరాక్షసుడికి మందు పెట్టి బొంద పెట్టాల్సిన సమయం ఆసన్నమైందంటూ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.