Heart Attack : ఆగని గుండెపోటు మరణాలు.. హార్ట్ ఎటాక్‌తో మరో విద్యార్థి మృతి, ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూనే..
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి రాకేశ్ మృతి చెందాడు. రాకేశ్ తన ఇంటి ఆవరణలో స్నేహితులతో మాట్లాడుతున్నాడు. ఇంతలో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు, స్నేహితులు రాకేశ్ ను ఆసుపత్రికి తరలించే లోపు రాకేశ్ మృతి చెందాడు.(Heat Attack)

Heart Attack : గుండెపోటు.. ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతున్న పదం. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న భయం. చిన్న, పెద్ద తేడా లేదు.. ధనిక, పేద అనే డిఫరెన్స్ లేదు.. వయసుతో సంబంధమే లేదు. అందరినీ కాటేస్తోంది హార్ట్ ఎటాక్. కుర్రాళ్లు, యువకులు, ఆరోగ్యవంతులు.. ఎవరినీ వదలడం లేదు. ఉన్నట్టుండి సడెన్ గా హార్ట్ ఎటాక్ వస్తుంది. అంతే, కుప్పకూలిపోతాడు. ఆ వెంటనే ప్రాణాలు కోల్పోతాడు.
ఈ మధ్య కాలంలో దేశంలో గుండెపోటు మరణాలు గణనీయంగా పెరగడం ఆందోళనకు గురి చేసే అంశం. అసలు ఎందుకిలా గుండెపోటు వస్తుంది? సడెన్ గా ”హార్ట్” పై ఎటాక్ ఎందుకు జరుగుతోంది? ఎందుకిలా ప్రాణాలు పోతున్నాయి.? ఇప్పుడీ ప్రశ్నలు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
మేడ్చల్ CMR ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలోనే విద్యార్థి విశాల్ గుండెపోటుతో మృతి చెందడం తెలిసిందే. ఈ విషాదం మరువక ముందే మరో ఇంటర్ విద్యార్థి గుండెపోటుతో చనిపోయాడు.(Heat Attack)
Also Read..Heart Attack : బాబోయ్.. గుండెపోటుతో మరో విద్యార్థి మరణం, మేడ్చల్ CMR కాలేజీలో విషాదం
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి రాకేశ్ మృతి చెందాడు. రాకేశ్ తన ఇంటి ఆవరణలో స్నేహితులతో మాట్లాడుతున్నాడు. ఇంతలో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు, స్నేహితులు రాకేశ్ ను ఆసుపత్రికి తరలించే లోపు రాకేశ్ మృతి చెందాడు. గుండెపోటుతోనే రాకేశ్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మధిరలోని ఓ ప్రైవేట్ కాలేజీలో రాకేశ్ ఇంటర్ చదువుతున్నాడు. రాకేశ్ అకాల మరణంతో తల్లిదండ్రులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.
దేశంలో గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదో ఒక పని చేస్తూ ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్ తో కుప్పకూలుతున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. వ్యాయామం చేస్తూ ఒకరు, డ్యాన్స్ చేస్తూ మరొకరు, కూర్చున్న వారు కూర్చున్నట్లే క్షణాల్లో ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. పట్టరాని ఆనందం వచ్చినా, భయాందోళనకు గురైనా గుండె కొట్టుకునే వేగం పెరగడం సర్వ సాధారణం. కానీ, ఏ కారణం లేకుండానే కొన్ని సెకన్ల పాటు గుండె వేగంగా కొట్టుకోవడం, తరుచూ అలా జరగడం గుండెపోటు లక్షణంగా చెబుతున్నారు డాక్టర్లు.(Heat Attack)
కరోనా మహమ్మారి తర్వాత గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ మరణాలకు కరోనాయే కారణం అని చెప్పే ఆధారాలేవీ లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ తర్వాత కొన్ని వారాల పాటు దాని ప్రభావం ఆరోగ్యంపై ఉంటుందని, కోవిడ్ 19 వల్ల శ్వాసకోశ వ్యాధులతో పాటు గుండెపోటు లాంటి ముప్పు కూడా పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.