Munugodu: రాజగోపాల్ రెడ్డిపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు.. అనర్హుడిగా ప్రకటించాలంటూ వినతి

మునుగోడు ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా సాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.

Munugodu: రాజగోపాల్ రెడ్డిపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు.. అనర్హుడిగా ప్రకటించాలంటూ వినతి

Munugodu: మునుగోడు ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా సాగుతోంది. ప్రధాన పార్టీలు ఎత్తులు-పై ఎత్తులు, విమర్శలు-ప్రతి విమర్శలతో దూసుకెళ్తున్నాయి. తాజాగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.

Rhino: అసోంలో రైనోను ఢీకొన్న ట్రక్కు.. స్పందించిన సీఎం.. ఏమన్నారంటే

రాజ గోపాల్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని కోరింది. ఈ మేరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఇతర నేతలు ఆదివారం ఈసీకి ఫిర్యాదు చేశారు. మునుగోడులో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని, రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ తీసుకున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా ఆయనే ఒప్పుకొన్నారని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకుని, అనర్హుడిగా ప్రకటించాలని కోరారు.

రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ తీసుకుని, మునుగోడులో ఓట్లు కొంటున్నారని టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఈ రూ.18 వేల కోట్లలో హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కూడా వాటా ఉందని వారు విమర్శించారు. కాంట్రాక్టుల ద్వారా వచ్చిన డబ్బుతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు.