Delta Variant : డెల్టాను ఎదుర్కోటానికి మరో 2నెలలు జాగ్రత్తగా ఉండాలి : డీహెచ్ శ్రీనివాసరావు

రాష్ట్రంలో డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని.. వైరస్ ను ఎదుర్కోటానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలంగాణ వైద్యా ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జీ.శ్రీనివాస రావు తెలిపారు. డెల్టా వేరియంట్    మరో 2 నెలలపాటు కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.

Delta Variant : డెల్టాను ఎదుర్కోటానికి మరో 2నెలలు జాగ్రత్తగా ఉండాలి : డీహెచ్ శ్రీనివాసరావు

Ts Dh Srinivasarao

Delta Variant : రాష్ట్రంలో డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని.. వైరస్ ను ఎదుర్కోటానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలంగాణ వైద్యా ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జీ.శ్రీనివాస రావు తెలిపారు. డెల్టా వేరియంట్    మరో 2 నెలలపాటు కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న 11 ప్రాంతాల్లో వైద్య బృందాలు పర్యటించి ఆయా ప్రాంతాల్లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు  చేపట్టినట్లు చెప్పారు.   రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని… ఆషాఢ బోనాలు, శ్రావణ మాసం రోజుల్లో వచ్చే పండగల దృష్ట్యా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన హెచ్చరించారు.

ప్రజలు భౌతికదూరం పాటించటం…మాస్కులు ధరించటం చేయాలని చెప్పారు. డెల్టా వేరియంట్ గాలి ద్వారా వ్యాపిస్తోందని తెలుస్తోంది కనుక ప్రజలు ఇళ్ల వద్ద కూడా మాస్క్ ధరించాలని సూచించారు.    షాపింగ్ మాల్స్ లో ఎక్కువ మంది ఒకే చోట గుమికూడ వద్దని… మాస్క్ లేకుండా ఉత్సవాల్లో పాల్గోనవద్దని  హెచ్చరించారు.

మరోవైపు రాష్ట్రంలో రాజకీయ కార్యాకలాపాలు ఎక్కువయ్యాయని… రాజకీయ నాయకులు మాస్క్‌లు పెట్టుకోకుండానే సభలు, సమావేశాల్లో పాల్గోంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మంది వైద్య సిబ్బంది కరోనా వైరస్ కట్టడికి నిరంతరం   శ్రమిస్తూ  అలసిపోయారని….. ఇలాంటి పరిస్ధితిలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని శ్రీనివాసరావు కోరారు.