లాక్ డౌన్ వల్ల చికిత్స అందక రెండేళ్ళ క్యాన్సర్ చిన్నారి మృతి

  • Published By: nagamani ,Published On : May 13, 2020 / 11:26 AM IST
లాక్ డౌన్ వల్ల చికిత్స అందక రెండేళ్ళ క్యాన్సర్ చిన్నారి మృతి

లాక్ డౌన్ ఆంక్షలను ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ అవసరమే. అది అందరికీ మంచిదే. కానీ మంచి అనుకునేది కొన్ని సందర్భాల్లో తీరని నష్టాలను కూడా కలుగజేస్తుంది. అది ఓ తల్లికి తీరని కడుపుకోతను మిగిల్చింది. కేన్సర్ బారిన పడిన రెండేళ్ల పసిబిడ్డకు వైద్యం అందలేదు. దీంతో ఆ పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయిన అత్యంత విషాద ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా నగరంలో వెలుగు చూసింది. 
 

బిశ్వజిత్ సాహా రెండేళ్ల కుమార్తె ప్రియాంషీ సాహాకు ఉదర కేన్సర్ వ్యాధితో బాధపడుతుండేది.  ప్రియాంషీకి కీమో  అర్జంటుగా చేయించాల్సి ఉంది. కీమో చేయించటానికి  24 పరగణాస్, కోల్ కతా నగరాల్లోని పలు ఆసుపత్రులకు వెళ్లారు. కీమోథెరపీ చేసే ప్రతీ హాస్పిటల్ కు తమ బిడ్డను తీసుకెళ్లారు ప్రియాంషీ తల్లిదండ్రులు. తిరగని హాస్పిటల్ అంటూ లేదు. కానీ..ప్రతీ హాస్పిటల్ లోను కరోనా కేసులు ఉన్నాయి. 

కరోనా వైరస్ ప్రబలుతున్న విపత్కర పరిస్థితుల్లో చిన్నారి పాప కేన్సర్ వ్యాధికి కీమోథెరపీ అత్యవసరంగా చేయాల్సి ఉన్నా..అడ్మిట్ చేసుకోని పరిస్థితి. దీంతో ప్రియాంషీకి కీమోథెరపీ సకాలంలో చికిత్స చేయకపోవడంతో తమ బిడ్డ మరణించిందని ప్రియాంషీ తండ్రి బిశ్వజిత్ సాహా ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డను ఎలాగైనా సరే బ్రతికించుకోవాలనే తపనతో ప్రతీ హాస్పిటల్ కు వెళ్లి వేడుకున్నా..అన్ని హాస్పిటల్స్ పరిస్థితి అలాగే ఉండటంతో కుదరలేదు. దీంతో చిన్నారి ప్రియాంషీని చనిపోయింది. 

కరోనా ప్రబలుతున్న విపత్కర పరిస్థితుల్లో తమ బిడ్డకు కరోనా సోకకపోయినా ఆ కరోనా భూతానికే బలైపోయిందని కుమార్తెకు ప్రియాంషీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. కాగా..గత డిసెంబర్ నెలలో ప్రియాంషీకి కలకత్తా మెడికల్ కాలేజీ (సిఎంసి) ఆసుపత్రిలో సర్జరీ జరిగింది. కొన్ని నెలలకు చిన్నారి పరిస్థితి క్షీణించింది. మొదటి కీమోథెరపీ చేశారు డాక్టర్లు. కానీ మరోసారి చేయాల్సి రావటం..చిన్నారిని తీసుకుని బరాసత్ జిల్లా ఆసుపత్రి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రత్యేక ఆసుపత్రి మరియు పరిశోధనా కేంద్రం, ఆర్.జి.కార్ మెడికల్ కాలేజ్ మరియు బరాసత్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్లకు తిరిగారు. కానీ కరోనా కేసులు పెరగటంతో కీమోథెరపీ చేయటం కుదరకపోవటంతో రెండేళ్ల చిన్నారి ప్రియాంషీ ప్రాణాలు కోల్పోయింది.

Read More:

కరోనా గొడుగు మన చుట్టూ రక్షణ కవచం

అప్పుడు తల్లిని.. ఇప్పుడు కొడుకుని.. మద్యం మానేయమన్నందుకు చంపేశాడు