Disha Encounter: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు రెండేళ్లు

అత్యంత పాశవికంగా వెటర్నటీ డాక్టర్‌ను కిడ్నాప్‌ చేసి అత్యాచారం, హత్య చేసిన నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేసి నేటికి సరిగ్గా రెండేళ్లు.

Disha Encounter: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు రెండేళ్లు

Disha

Disha Encounter: అత్యంత పాశవికంగా వెటర్నటీ డాక్టర్‌ను కిడ్నాప్‌ చేసి అత్యాచారం, హత్య చేసిన నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేసి నేటికి సరిగ్గా రెండేళ్లు. నవంబర్‌ 28, 2019న రాత్రి డాక్టర్‌ దిశను చెన్నకేశవులు, మహ్మద్ హారీఫ్, జొల్లు నవీన్, జొల్లు శివ అనే నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి హత్యచేయగా.. ఒక్కరోజులోనే వారిని పట్టుకున్నారు పోలీసులు.

అనంతరం సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా సంఘటనా స్థలానికి తీసుకుని వెళ్లగా.. డిసెంబర్ 6వ తేదీ తెల్లవారుజామున వారు పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసుల ఆయుధాలను లాక్కొని కాల్పులకు యత్నించగా ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. చటాన్‌పల్లి బ్రిడ్జ్ వద్ద నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు.

అయితే, ఎన్‌కౌంటర్ తర్వాత నిందితుల మృతిపై సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటైంది. కమిషన్ సభ్యులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సిర్పూర్ కర్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేఖా ప్రకాష్, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్‌లను నియమించారు. ఎన్‌‍కౌంటర్ నిజమా? ఫేక్ ఎన్‌కౌంటర్ అని తేల్చనున్నారు కమిషన్. ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనుంది కమిషన్.