Kishan Reddy : రాజాకార్ల,నిజాం వారసులు తెలంగాణాను ముంచుతున్నారు-కిషన్ రెడ్డి

తెలంగాణలో ఒకరు రజాకార్ల వారసులు,  మరోకరు నిజాం వారసులని ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని ముంచుతున్నారని టీఆర్ఎస్, ఏంఐఎం పార్టీలపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు. 

Kishan Reddy : రాజాకార్ల,నిజాం వారసులు తెలంగాణాను ముంచుతున్నారు-కిషన్ రెడ్డి

kishna reddy

Kishan Reddy  :  తెలంగాణలో ఒకరు రజాకార్ల వారసులు,  మరోకరు నిజాం వారసులని ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని ముంచుతున్నారని టీఆర్ఎస్, ఏంఐఎం పార్టీలపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు.  కేసీఆర్  బీజేపీపై ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని  ఆయన  అన్నారు. ఈరోజు హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  ఆయన….ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న బెంగళూరుకు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడను కలిసి రెండు నెలల్లో సంచలనం సృష్టిస్తాం అని కామెంట్స్ చేశారని… కేసీఆర్ గతంలో కూడా ప్రళయం సృష్టిస్తా, భూకంపం సృష్టిస్తా, బీజేపీని బంగాళాఖాతంలో కలపాలి అని ఎన్నో కామెంట్స్ చేశారని ఎద్దేవా చేశారు.

ప్రధాని మోడీ రోజుకు 18 గంటలు పనిచేస్తారు.. అదే కేసీఆర్ నెలకు 18 గంటలు పని చేస్తారని కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవిష్యత్ కేసీఆర్ చెప్పు చేతల్లో పెట్టుకున్నారని… 8 ఏళ్లలో రాష్ట్రాన్ని దోచుకుంది సరిపోదా అని ఆయన ప్రశ్నించారు.  మీలో మార్పురాకపోతే ప్రజలు  దాన్ని మారుస్తారని… వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పట్టంకడతారని కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని కేసీఆర్ కు సంబంధించిన మీడియా  బీజేపీని   గుజరాత్ పార్టీ అంటూ వ్యాఖ్యానిస్తోందని,,, కాశ్నీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న సంగతి మర్చిపోవద్దన్నారు.

జేపీ నడ్డా.. తర్వాత ప్రధాని మోడీ… ఆతర్వాత స్ధానాల్లో వారి కుటుంబ సభ్యులెవరూ ఉండరు. అలా చెప్పే దమ్ము మీకుందా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. బీజేపీ కుటుంబ పాలనను  వ్యతిరేకిస్తుందని…. వారి కారణంగా రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలేమైనా   కల్వకుంట్ల కుటుంబానికి జీపీఏ రాసిచ్చారా అని కిషన్ రెడ్డి అన్నారు.  తెలంగాణకు కేంద్రం ఏమి ఇవ్వకుండానే ఇంత అభివృధ్ది జరిగిందా అని కిషన్ రెడ్డి అన్నారు.

గ్రామ  పంచాయతీలకు కేంద్రం ఎంత.. రాష్ట్రం ఎంత ఇచ్చిందో సీఎం కేసీఆర్ చర్చకు సిద్ధమా….రాష్ట్రంలో బస్తీ దవాఖానకు ఇస్తున్న నిధుల్లో కేంద్ర వాటా లేదా….కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఆర్ధిక సంస్థలు రుణాలు ఇచ్చింది నిజం కాదా….. పెట్రోల్, డీజిల్ పై ఒక్క రూపాయి కూడా తగ్గించని మీరు.. మాపై విమర్శలు చేస్తారా? అని కేంద్ర మంత్రి ఆగ్రహం వెలిబుచ్చారు.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని…కేసీఆర్ కూతలకు ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని ఆయన అన్నారు.

Also Read : Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు