మండిపోతున్న ఎండలు, అప్పుడే 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు

తెలంగాణలో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. భానుడి భగభగలకు జనాలు విలవిలలాడిపోతున్నారు. ఎండ తీవ్రతకు చెమట్లు కక్కుతున్నారు. అప్పుడే పగటి ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోంది. క్రమంగా టెంపరేచర్లు రికార్డ్ స్థాయికి చేరుతున్నాయి. మార్చి నెలలోనే 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం జనాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని వర్రీ అవుతున్నారు.

మండిపోతున్న ఎండలు, అప్పుడే 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు

Temperature High

very hot sun, temperatures reach 40 degrees: తెలంగాణలో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. భానుడి భగభగలకు జనాలు విలవిలలాడిపోతున్నారు. ఎండ తీవ్రతకు చెమట్లు కక్కుతున్నారు. అప్పుడే పగటి ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోంది. క్రమంగా టెంపరేచర్లు రికార్డ్ స్థాయికి చేరుతున్నాయి. మార్చి నెలలోనే 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం జనాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని వర్రీ అవుతున్నారు.

ఆదివారం(మార్చి 14,2021) అత్యధికంగా మణుగూరు (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)లో 39.2, ఏన్కూరు (ఖమ్మం)లో 38.7, కన్నెపల్లి (మంచిర్యాల)లో 38.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రిపూట ఉష్ణోగ్రత సాధారణం కన్నా 4 డిగ్రీల వరకూ తక్కువగా ఉంటోంది.

ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు కేర్ ఫుల్ గా ఉండాలంటున్నారు. ఎండలో బటయకు వెళ్లాల్సి వస్తే గొడుగు వాడటం మంచిందంటున్నారు. అలాగే డీహైడ్రేషన్ కు గురి కాకుండా సరిపడ నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. దాహార్తిని తీర్చుకోవడానికి కూల్ డ్రింక్స్ బదులు మంచి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవడం బెటర్ అంటున్నారు.