చేతిలో పుస్తకం..టీవీలో పాఠాలు ఎప్పుడో ?

  • Published By: madhu ,Published On : August 20, 2020 / 10:56 AM IST
చేతిలో పుస్తకం..టీవీలో పాఠాలు ఎప్పుడో ?

టీవీ లో పాఠాలు ఎప్పుడు చెబుతారోనంటూ..తెలంగాణ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఆగస్టు నెలాఖరు వరకు కూడా ఈ సౌకర్యం రాదని తెలుస్తోంది. ఆగస్టు 20వ తేదీ గురువారం నుంచి టీవీల ద్వారా పాఠాల ప్రసారాన్ని మొదలు పెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది.



గురువారం నుంచి 6 నుంచి 10వ తరగతులకు ఈ పాఠాలు ప్రసారం కావాల్సి ఉంది. కానీ..ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే..ఈ నెలాఖరు వరకు..స్కూళ్లు తెరవడంపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. హైకోర్టులో కేసు ఇంకా పెండింగ్ లో ఉంది. మరలా 27వ తేదీన విచారణకు రానుంది.

మరికొన్ని కారణాలతో ప్రభుత్వం డిజిటల్ పాఠాలకు ఒకే చెప్పలేదని అంటున్నారు. అయితే..న్యాయస్థానం ఆన్ లైన్ పాఠాలు వద్దనడం లేదని, ప్రైవేటు పాఠశాలలకు కూడా అనుమతినిచ్చారా ? లేదా ? అనేది ప్రశ్నిస్తోందని వెల్లడిస్తున్నారు.



ప్రస్తుతం కరోనా టైం నడుస్తోంది. ఈ కారణంగా దేశ వ్యాప్తంగా స్కూళ్లు మూతపడ్డాయి. దీంతో కొన్ని ప్రైవేటు స్కూళ్లు ఆన్ లైన్ లో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. కానీ..గ్రామీణ విద్యార్థులకు ల్యాప్‌ టాప్ లు, స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు దూరదర్శన్‌ ద్వారా పాఠాలు చెప్పాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఉన్నత న్యాయస్థానం సూచనల మేరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దూరదర్శన్‌, ఇతర చానళ్ల ద్వారా పాఠాలు ప్రసారం చేయాలని నిర్ణయించింది. కానీ ప్రస్తుతం నెలకొన్న సమస్యలు ఎప్పుడు తొలుగుతాయో చూడాలి.