Yadamma: నన్ను ఎవరూ అడ్డుకోలేదు.. ఆ వార్తలను ఖండించిన వంటల స్పెషలిస్ట్ యాదమ్మ

తనపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను వంటల స్పెషలిస్ట్ యాదమ్మ ఖండించారు. హైదరాబాద్ నోవాటెల్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, జాతీయ నేతలకు తెలంగాణ వంటలను రుచి చూపించేందుకు యాదమ్మను పిలిపించారు.

Yadamma: నన్ను ఎవరూ అడ్డుకోలేదు.. ఆ వార్తలను ఖండించిన వంటల స్పెషలిస్ట్ యాదమ్మ

Yadamma

Yadamma: తనపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను వంటల స్పెషలిస్ట్ యాదమ్మ ఖండించారు. హైదరాబాద్ నోవాటెల్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, జాతీయ నేతలకు తెలంగాణ వంటలను రుచి చూపించేందుకు యాదమ్మను పిలిపించారు. అయితే పాస్ లేదంటూ నోవాటెల్‌లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని, దీంతో యాదమ్మ తన అనుచరులతో కలిసి రోడ్డుపైనే బైఠాయించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. ఈ వార్తలను యాదమ్మ ఖండించారు. ఈ సందర్భంగా యాదమ్మ మాట్లాడిన వీడియోను తెలంగాణ బీజేపీ శాఖ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.

తనను నోవెటాల్ లోకి రానివ్వలేదని కొందరు మూర్ఖులు దుష్ప్రచారం చేశారంటూ యాదమ్మ మండిపడింది. నోవాటెల్ దగ్గరకు మేము చేరుకున్న సమయంలో ప్రముఖులు రావడంతో మేము కొద్దిసేపు వేచి ఉండాల్సి వచ్చిందని, స్థానికంగా ఉన్న కొందరు యువకులు తమను పక్కకు కూర్చోమని సూచించడంతో అక్కడకు వెళ్లి కూర్చున్నామని, ఆ ఫోటోలను తీసి తాము నిరసన చేస్తున్నామని కొందరు తప్పుడు ప్రచారం చేశారంటూ యాదమ్మ మండిపడింది. ఫొటోలు తీసే సమయంలో తనకు వాళ్ల దుర్బుద్ధి అర్థం కాలేదని యాదమ్మ పేర్కొంది. తమకు ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వలేదని, వెంటనే నోవాటెల్ లోకి పంపించారని, తాము వంటలు చేశామని, ప్రధాని మోదీ, ఇతర పెద్ద నేతలతో కలిసి భోజనంసైతం చేసే అవకాశం కల్పించారని యాదమ్మ తెలిపింది.

ఇదిలాఉంటే ఆదివారం నోవాటెలో యాదమ్మ బృందం తయారు చేస్తున్న తెలంగాణ వంటకాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా యాదమ్మ బృందంకు సంజయ్ పలు సూచనలు చేశారు. అనంతరం ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టి తేవాలని బండి సంజయ్ వారికి సూచించారు.