Corona : కొన్ని రోజుల్లో పెళ్లి.. ఇంతలో తీరని విషాదం.. కరోనాతో యువతి మృతి

కరోనా మహమ్మారి ఎందరో జీవితాలు, కుటుంబాలు, ఇళ్లలో తీరని విషాదాన్ని నింపుతోంది. తాజాగా.. పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో శోకాన్ని నింపింది. పెళ్లి పీటలెక్కాల్సిన యువతి వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం షాక్‌లోకి

Corona : కొన్ని రోజుల్లో పెళ్లి.. ఇంతలో తీరని విషాదం.. కరోనాతో యువతి మృతి

Young Woman Die With Corona

Young Woman Die With Corona : కరోనా మహమ్మారి ఎందరో జీవితాలు, కుటుంబాలు, ఇళ్లలో తీరని విషాదాన్ని నింపుతోంది. తాజాగా.. పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో శోకాన్ని నింపింది. పెళ్లి పీటలెక్కాల్సిన యువతి వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం షాక్‌లోకి వెళ్లింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఉప్పల్‌ భరత్‌ నగర్‌కి చెందిన కె.అనంతయ్య కూతురు కె శ్రీవాణి (22)కి పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 13 వివాహం జరగాల్సి ఉంది. దీంతో ఆ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. కుటుంబం మొత్తం పెళ్లి పనుల్లో నిమగ్నమైంది.

ఇంతలో.. శ్రీవాణి అనారోగ్యానికి గురైంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెకు కరోనా టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఏప్రిల్ 21న ఆమెను ఎల్బీనగర్‌‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయినా లాభం లేకపోయింది. హెల్త్ కండీషన్ సీరియస్ కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం(ఏప్రిల్ 30,2021) శ్రీవాణి ప్రాణాలు కోల్పోయింది. మరో పది రోజుల్లో వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన కూతురు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.