YS Sharmila: వైఎస్ షర్మిల దీక్ష భగ్నం.. అపోలో ఆస్పత్రికి తరలించిన పోలీసులు

శనివారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత లోటస్‌పాండ్‌ చేరుకున్న పోలీసులు బలవంతంగా షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి సమీపంలోని జూబ్లీహిల్స్, అపోలో ఆస్పత్రికి తరలించారు.

YS Sharmila: వైఎస్ షర్మిల దీక్ష భగ్నం.. అపోలో ఆస్పత్రికి తరలించిన పోలీసులు

YS Sharmila: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్షను హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ, లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్టీపీ కార్యాలయంలో షర్మిల రెండు రోజుల నుంచి ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. పాదయాత్రకు అనుమతిచ్చే వరకు దీక్ష విరమించబోనని చెప్పారు.

Twitter: రేపే ‘ట్విట్టర్ బ్లూ’ రీలాంఛ్.. ఐఫోన్లకు ఎక్కువ ఛార్జీ వసూలు

అయితే, ఆహారం తీసుకోకపోవంతో షర్మిల ఆరోగ్యం క్షీణిస్తోంది. దీంతో పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేశారు. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత లోటస్‌పాండ్‌ చేరుకున్న పోలీసులు బలవంతంగా షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి సమీపంలోని జూబ్లీహిల్స్, అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ షర్మిలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా, దీక్ష సందర్భంగా షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘‘పాదయాత్రకు హైకోర్టు అనుమతించనా టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతివ్వడం లేదు. వైఎస్సార్టీపీ నాయకులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వాళ్లను శనివారం కూడా విడుదల చేయలేదు. పాత కేసులతో మళ్లీ అరెస్టు చేస్తున్నారు.

పార్టీ కార్యాలయం చుట్టూ పోలీసులు మోహరించి సామాన్యుల్ని రానివ్వడం లేదు. పాదయాత్ర సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి గురించి మాట్లాడుతున్నందుకే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. పాదయాత్ర సందర్భంగా ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదు. అధికార పార్టీ నాయకులే దూషించారు. పాదయాత్రలో నిబంధనలు ఉల్లంఘించలేదు’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.