Rangareddy : తెలంగాణ రైతుల సమస్యలపై షర్మిల ఫోకస్..పరిగిలో పర్యటన

తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు వైయస్ షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో అటు అధికార పార్టీపై విమర్శనాస్త్రలు సంధిస్తూనే మరోవైపు పార్టీ విధి విధానాలపై పార్టీ ముఖ్య నేతలతో వరుసగా సమావేశాలు పెట్టి బిజీ బిజీగా గడుపుతున్నారు. పార్టీ పేరును జులై8న ప్రకటిస్తానని ప్రకటించిన షర్మిల తెలంగాణ రైతు సమస్యలపై కూడా షర్మిల ఫోకస్ పెట్టారు. ఈక్రమంలో రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. రైతుల సమస్యలు తెలుసుకోనున్నారు.

Rangareddy : తెలంగాణ రైతుల సమస్యలపై షర్మిల ఫోకస్..పరిగిలో పర్యటన

Sharmila Visit To Rangareddy

Sharmila visit to Rangareddy : తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు వైయస్ షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో అటు అధికార పార్టీపై విమర్శనాస్త్రలు సంధిస్తూనే మరోవైపు పార్టీ విధి విధానాలపై పార్టీ ముఖ్య నేతలతో వరుసగా సమావేశాలు పెట్టి బిజీ బిజీగా గడుపుతున్నారు. పార్టీ పేరును జులై8న ప్రకటిస్తానని ప్రకటించిన షర్మిల తెలంగాణ రైతు సమస్యలపై కూడా షర్మిల ఫోకస్ పెట్టారు.

ఈ క్రమంలో దూకుడును పెంచిన వైయస్ షర్మిల పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చేస్తున్న రైతులను పరామర్శించనున్నారు. కొన్ని రోజుల క్రితం వికారాబాద్ జిల్లాలో ఓ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక..అధికారులు తమ గోడు పట్టించుకోవటం లేదనంటూ తీవ్ర ఆవేదన చెందిన తన ధాన్యాన్ని నడిరోడ్డుమీద పోసి నిప్పు అంటించాడు. ఈ క్రమంలో షర్మిల రంగారెడ్డి జిల్లాలో వైయస్ షర్మిల పర్యటించనున్నారు. వికారాబాద్, పరిగి ప్రాంతాల్లోని రైతుల కష్టసుఖాలను తెలుసుకోవటానికి పర్యటిస్తున్నారు. ఐకేపీ సెంటర్లలో నిలిచిపోయిన ధాన్యాన్ని పరిశీలించనున్నారు.

తాము పండించిన పంటను గిట్టుబాటు ధర లభించటంలేదని అటు ప్రభుత్వం కూడా ధాన్యాన్ని కొనటంలేదని ధాన్యాన్ని తగల బెట్టిన రైతుల బాధలు తెలుసుకోనునున్నారు. మొత్తానికి పార్టీ ఆవిర్భావం జరుగనున్న క్రమంలో ప్రజల్లోకి వెళ్ళాలని షర్మిల నిర్ణయించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే అడహక్ కేంద్రాల ఏర్పాటు జరగనుంది. అలాగే మరిన్ని పర్యటనలతో షర్మిల పలువురిని కలిసి వారి కష్టసుఖాలు తెలుసుకోనున్నారు. మొత్తానికి షర్మిల రాజకీయ పార్టీ గురించి తెలంగాణలో చర్చు జరిగేలా షర్మిల పక్కా ప్లాన్ తో ముందుకెళుతున్నారు. మరి తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడి క్రియేట్ చేసి వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పై కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తున్న షర్మిల పార్టీ ఎటువంటి మార్పులు తీసుకొస్తుందో వేచి చూడాలి.