YS Sharmila : తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబంలో ఎంత మంది చనిపోయారు? : వైఎస్ షర్మిల

కేసీఆర్ ఏడమ కాలి చెప్పకింద తెలంగాణ ఆత్మగౌరవం నలుగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినందుకు మిమ్మలిని ఏం చేయాలని అన్నారు.

YS Sharmila : తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబంలో ఎంత మంది చనిపోయారు? : వైఎస్ షర్మిల
ad

YS Sharmila criticised CM KCR : సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ కు పోడు భూముల సమస్య పరిష్కరించాలని సోయి కూడా లేదని మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలం ఉప్పుసాక గ్రామంలో రైతు దీక్షలో వైఎస్ షర్మిల పాల్గొని, మాట్లాడారు. తెలంగాణ తెచ్చింది వాళ్ళే నట.. జీవితాంతం వాళ్ళకే ఓటు వేయాలని కేటీఆర్ అంటున్నాడు అని పేర్కొన్నారు. తెలంగాణను ఎవరు తెచ్చారని ప్రశ్నించారు. కోట్ల మంది ఆకాంక్షిస్తే తెలంగాణ వచ్చిందన్నారు. లక్షల మంది ఉద్యమిస్తే తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు.

వేల మంది ఆస్తులను త్యాగం చేస్తే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. వందల మంది బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని వెల్లడించారు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబంలో ఎంత మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలో ఎంత మంది చనిపోయారని నిలదీశారు. కేసీఆర్ గారు బాగుండాలి…రాజ్యాలు ఏలాలి, కానీ ప్రజలు అవస్థలు పడాలి.. ఆత్మహత్యలు చేసుకోవాలా అని అడిగారు. ఏం జరుగుతుంది తెలంగాణలో…ఎవరు తెచ్చారు తెలంగాణను ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం ఉద్యమంలో ఎం చేసిందని నిలదీశారు.

YS Sharmila : కేసీఆర్ రాజీనామా చేయాలి..దళితుడిని సీఎం చేయాలి : షర్మిల

పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె మరిచి పోయినట్లు నాటకం ఆడారని ఎద్దేవా చేశారు. గడ్డాలు పెంచుకున్నారు…దీక్షలు చేసినట్లు నాటకం ఆడారని విమర్శించారు. వాళ్ళ రాజకీయం కోసం ప్రజలను వాడుకున్నారని ఆరోపించారు. ఈ రోజు వరకు సెంటిమెంట్ ను వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలను వాడుకొని వారి శవాల మీద సింహాసనం వేసుకొని కూర్చున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద గడీలు కట్టుకొని రాజ్యాలు ఏలుతున్నారని మండిపడ్డారు. ఆత్మగౌరవం అవసరానికి వాడుతున్నారని పేర్కొన్నారు.

కేసీఆర్ ఏడమ కాలి చెప్పకింద తెలంగాణ ఆత్మగౌరవం నలుగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినందుకు మిమ్మలిని ఏం చేయాలని అన్నారు. కనీసం పంట నష్ట పోయిన రైతుకు నష్టపరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదని విమర్శించారు. తెలంగాణ లో మీది దిక్కుమాలిన ప్రభుత్వం అని విమర్శించారు. మిమ్మల్ని రాళ్లతో కొట్టాలా…చీపురు తో కొట్టాలా..? అని అన్నారు. ప్రజల కష్టాలను పట్టించుకోని మీ మీద చెప్పులు వేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.