Cotton, Chilli Farming : సెమీఆర్గానిక్ పద్ధతిలో పత్తి, మిరప సాగు

అధిక మోతాదులో రసాయన ఎరువులు వాడటం.. మరోవైపు ప్రకృతి సహకరించకపోవడంతో మూడునాలుఏళ్లుగా నష్టాలను చవిచూస్తున్నారు. దీంతో గత ఏడాది నుండి స్థానికంగా దొరికే సేంద్రియ ఎరువులను కొద్ది మొత్తంలో వాడారు.

Cotton, Chilli Farming : సెమీఆర్గానిక్ పద్ధతిలో పత్తి, మిరప సాగు

Cotton, Chilli Farming In Orgnic

Cotton, Chilli Farming : ఆశించిన లాభాలు రాకపోతే రైతులు దిగాలు పడతారు. కొందరు ఆత్మహత్యలకు సైతం వెనకాడరు. కానీ నల్గొండ జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం… ప్రత్యామ్నాయ పంటలు, ప్రత్యామ్నాయ పద్ధతులపై దృష్టి పెట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సెమీ ఆర్గానిక్ పద్ధతిలో  పత్తి, మిరప తోటల సాగుచేస్తూ.. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులను పొందేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఈ రైతు వాడిన ఎరువులు ఏంటీ.. పైర్లు ఏవిధంగా ఉన్నాయి.. ఎంత పెట్టుబడి తగ్గుతుందో.. రైతు అనుభం ద్వారానే తెలుసుకుందాం..

READ ALSO : Mixed Farming : చేపలు, కోళ్లు, పశువులతో.. మిశ్రమ వ్యవసాయం చేస్తున్న రైతు

పంటసాగులో రసాయన ఎరువుల వినియోగం పెరగడంతో పంట భూములు చౌడుబారి పోతున్నాయి. దీంతో పెట్టుబడి ఎక్కువ రాబడి తక్కువ అన్నట్లుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే రైతులు సేంద్రీయ సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. అందుబాటులో ఉన్న వనరుల్ని ఉపయోగించుకుని సేంద్రీయ ఎరువులను తయారుచేసుకొని.. వాటిని పంట పొలాల్లో వేస్తూ.. సాగు చేస్తున్న రైతులు కొందరైతే.. రెడీమేడ్ గా మార్కెట్ లో దొరికే సేంద్రియ ఎరవులను వాడి సాగుచేసే రైతులు మరికొందరు.. ఈ కోవకే చెందుతారు నల్గొండ జిల్లా, చందంపేట మండలం, ముడిదండ్ల గ్రామానికి చెందిన రైతు ఏమిరెడ్డి లక్ష్మారెడ్డి.

READ ALSO : Mixed Farming : ఒకే పంట విధానం కన్నా మిశ్రమ వ్యవసాయంతో అధిక లాభాలు..

మొత్తం 6 ఎకరాల్లో విస్తరించిన ఈ చేనులో ఒక్కో మొక్కకు 40 నుండి 60 కాయలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అక్కడక్కడ పత్తి పగులుతుంది. రైతు లక్ష్మారెడ్డి.. ప్రతి ఏటా పత్తి పంటనే సాగుచేస్తూ ఉంటాయి. అయితే దిగుబడులకోసం అధిక మోతాదులో రసాయన ఎరువులు వాడటం.. మరోవైపు ప్రకృతి సహకరించకపోవడంతో మూడునాలుఏళ్లుగా నష్టాలను చవిచూస్తున్నారు. దీంతో గత ఏడాది నుండి స్థానికంగా దొరికే సేంద్రియ ఎరువులను కొద్ది మొత్తంలో వాడారు. తోటి రైతులతో పోల్చితే దిగుబడి పర్వాలేదనిపించడంతో ఈ ఏడాది అధిక మొత్తంలో సేంద్రియ ఎరువులను వాడి పత్తి పంటను సాగుచేస్తున్నారు. పంట ఆశాజనకంగా ఉండటంతో..  రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

READ ALSO : Mixed Farming : ఒకే పంట విధానం కన్నా మిశ్రమ వ్యవసాయంతో అధిక లాభాలు..

పత్తితో పాటు రైతు ఈ ఏడాది ప్రయోగాత్మకంగా మిరప పంటను సాగుచేస్తున్నారు. రెండేళ్లుగా మార్కెట్ లో మిరప ధరలు ఆకాశానంటుతుండటంతో 3 ఎకరాల్లో స్థానిక నర్సరీల్లో మిరపనారును తెచ్చి నాటారు. సెమీ ఆర్గానిక్ పద్ధతిలో ఎరువులు వేయటం.. పంట పెరుగుదల ఆశాజనకంగా ఉంది. అయితే మార్కెట్ లో ధరలు ఇలాగే కొనసాగితే… మంచి లాభాలను పొందుతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.