Mixed Farming : మిశ్రమ వ్యవసాయంతోనే స్థిరమైన ఆర్థిక వృద్ధి

Mixed Farming : ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడిపశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు పెంపకం చేపట్టి ఖచ్చితమూన ఆదాయాన్ని పొందేవారు.

Mixed Farming : మిశ్రమ వ్యవసాయంతోనే స్థిరమైన ఆర్థిక వృద్ధి

Mixed Farming : తల్లి భూదేవి చల్లగా చూస్తే అన్నం ముద్దకు కరువే లేదని రైతు ఆత్మవిశ్వాసంతో ప్రకటించేవాడు. ఇది గతం. ఇప్పుడు నాలుగెదైకరాలున్న సన్నకారు రైతుల నుంచి.. పదుల ఎకరాల మోతుబరులు కూడా సాగులో తగిలిన దెబ్బలకు నవనాడులు కుంగిపోయి, జవసత్వాలు కూడగట్టుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. వ్యవసాయం వ్యాపార పరమార్థమయ్యాక పరిస్థితి మారింది.

ఒక వైపు వ్యాపారుల మాయాజాలం, మరో వైపు పగబట్టి ప్రకృతి కొట్టిన దెబ్బలకు కుంగిపోతున్నారు. లాభాల సంగతి దేవుడెరుగు బతుకు గడిస్తే చాలనుకునేటట్లు మిగిలారు. ఈ పరస్థితుల నుండి గట్టెక్కాలంటే మిశ్రమ వ్యవసాయం చేయక తప్పదంటున్నారు శాస్త్రవేత్తలు.

Read Also : Kharbuja Cultivation : వేసవిలో మంచి డిమాండ్.. కష్టాలు తీర్చుతున్న కర్బుజా సాగు

మన్ను నుంచి అన్నం తీసిన చేతులు మట్టి పనులు చేయడానికి వలసబాట పడుతున్నాయి. వ్యవసాయ రంగాన్ని ఎక్కి ఏలుతున్న ఆధునికత ధాటికి సాగు నిలువునా కూలిన ఇల్లయింది. వ్యవసాయం ప్రధాన, అనుబంధ రంగాల మేలుకలయికగా కలిసి నడిచిననాడు కూడుకు, గుడ్డకు లోటన్నది కానరాలేదు. మార్కెట్ లక్ష్యంగా సాగు మొదలు పెట్టిన నాటి నుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడిపశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు పెంపకం చేపట్టి ఖచ్చితమూన ఆదాయాన్ని పొందేవారు.

అయితే, వివిధ కారణాల దృష్ట్యా పశుసంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు. అంతే కాకుండా ఒకే పంటను సాగుచేస్తూ నష్టపోతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావాల్సినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత , ఆదాయం లభించడం లేదు. వ్యవసాయాన్ని శాస్త్రీయబద్ధంగా చేపడుతూ క్షేత్రవనరులనూ సమర్ధవంతంగా వినయోగించుకోవడం అత్యంత అవసంరం.

మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయం అనుబంధ రంగాలను ఎన్నుకొని కలగలుపుగా వ్యవసాయం చేపట్టాలి. ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు , వ్వర్ధాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి పెట్టుబడులుగా ఉపయోగపడుతాయి. అంతే ఒకటి కాకపోయిన ఒక దాంట్లోనైనా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

మిశ్రమ వ్యవసాయ విధానాల వల్ల రైతుకు ఒక వ్యవస్థలో నష్టం వచ్చినా మరో దానిలో వచ్చే రాబడి వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ వ్యర్ధాల వినియోగంతో సాగు ఖర్చు తగ్గుతుంది. పశుగ్రాసాల కొరత ఉండదు. పశుపోషణ ఆరోగ్యవంతంగా ఉంటుంది. చిన్న, సన్నకారు రైతులకు నిరంతర ఉపాధి, స్థిరమైన ఆదాయం లభిస్తుంది. భూసార, పర్యావరణ పరిరక్షణతో పాటు పెరుగుతున్న జనాభాకు ఆహార భద్రత లభిస్తుంది.

Read Also : Mustard Cultivation : ఆవాల సాగుకు అనువైన ప్రాంతం విశాఖ ఏజెన్సీ