Paddy Farming : వరినాట్లు వేసేటప్పుడు పాటించాల్సిన సూచనలు
నాటేముందు 70 నుంచి 80 లీటర్ల నీటికి 2కిలోల అజోస్పైరిల్లమ్ జీవన ఎరువు కలిపిన ద్రావణంలో నారు వేర్లను 10 నిమిషాలపాటు ముంచి నాటుకుంటే నత్రజని సహజసిద్ధంగా మొక్కలకు అంది మొనలు త్వరగా నిలదొక్కుకుంటాయి. యూరియా వాడకాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.

Paddy Farming
Paddy Farming : తొలకరిలో పడిన వర్షాలకు బోర్లు, బావుల క్రింద, ముందుగా వరి నారుమళ్ళు పోసుకున్న రైతాంగం, నాట్లను వేస్తున్నారు. కాలువలు, చెరువుల కింద వరిసాగుచేసే రైతులు ఇప్పుడిపపుడే నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. నీటి సదుపాయం తక్కువగా వున్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలవైపు మొగ్గుచూతున్నారు. వీటిలో డ్రమ్ సీడర్ తో నేరుగా దమ్ములో విత్తే విధానం, యంత్రాలతో నాట్లు వేయటం వంటి సాగు విధానాలు రైతుల క్షేత్రాలలో సత్ఫలితాలనిస్తున్నాయి. నాట్లు ఏ పద్ధతిలో వేసినా, మనం చేపట్టే సాగు విధానాలు, పోషక యాజమాన్యం పైనే దిగుబడులు ఆధారపడి వుంటాయి. మరిన్ని వివరాలు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ ద్వారా తెలుసుకుందాం.
READ ALSO : Agriculture: ఎకరంలో పది పంటలు పండిస్తున్న రైతు
తొలకరి ఆరంభంలోనే నారుమళ్ళు పోసుకున్న రైతాంగం, నారు వయసు 30 రోజులు దాటకముందే నాట్లు వేయటం మంచిది. నాట్లు వేయటానికి ముందుగానే ప్రధాన పొలాన్ని రెండు మూడు దఫాలుగా మురగ దమ్ముచేసుకోవాలి. ఎత్తు పల్లాలు లేకుండా పొలమంతా సమానంగా వుండేటట్లు, పవర్ టిల్లర్ లేదా రోటోవేటర్ ఉపయోగించి దమ్ముచేసినట్లయితే మంచి ఫలితం వుంటుంది. నాటడానికి నాలుగు నుంచి ఆరు ఆకులు కలిగిన ఆరోగ్యవంతమైన నారును ఉపయోగించాలి.
READ ALSO : స్మార్ట్ సేద్యం.. యాప్ సాయంతో పంటలు… నూజివీడు త్రిపుల్ ఐటీ విద్యార్థుల ఘనత
నాటేముందు 70 నుంచి 80 లీటర్ల నీటికి 2కిలోల అజోస్పైరిల్లమ్ జీవన ఎరువు కలిపిన ద్రావణంలో నారు వేర్లను 10 నిమిషాలపాటు ముంచి నాటుకుంటే నత్రజని సహజసిద్ధంగా మొక్కలకు అంది మొనలు త్వరగా నిలదొక్కుకుంటాయి. యూరియా వాడకాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ప్రధాన పొలంలో నీరు పలుచగా పెట్టి, వరుసల్లో క్రమ పద్ధతిగా పైపైన నాటుకుంటే మంచిది. నాటేటపుడు ప్రతి చదరపు మీటరుకు 33 మొనలు వుండే విధంగా నాటుకోవాలి. నాటిన తర్వాత ప్రతి 2 మీటర్లకు తప్పనిసరిగా కాలిబాటలు వదులుకున్నట్లయితే పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతిని కొంతవరకు అదుపుచేయవచ్చు.
READ ALSO : Intercrops In Palm Oil : పామాయిల్ లో అంతర పంటలుగా కోకో, మిరియాల సాగు
చూశారుగా.. వరిసాగులో ప్రతికూల పరిస్థితులను అధిగమించే సాగు పద్ధతులను. అందివస్తున్న నూతన సాగు విధానాలను ఆచరిస్తూ, సిఫారసు మేరకు సమగ్ర పోషకయాజమాన్యాన్ని ఆచరిస్తే.. సాగులో పెట్టుబడుల భారాన్ని తగ్గించుకోవటమే కాదు సంప్రదాయ వరిసాగు కన్నా అధిక దిగుబడులు పొందవచ్చు.